Rohit Captaincy Record: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాపై సాధించిన విజయంతో రోహిత్ శర్మ నాలుగు ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్ కు చేరిన మొట్టమొదటి కెప్టెన్ గా రికార్డ్ సృష్టించాడు. ఇంతవరకు ఏ ఆటగాడు కూడా ఈ ఘనతను సాధించలేదు. కోహ్లీ నుండి వన్డే మరియు టి20 పగ్గాలు ఒకేసారి చేపట్టిన రోహిత్ మొదటి ఐసీసీ టోర్నమెంట్ లోనే కెప్టెన్ గా నిరాశపరిచాడు. అయితే ఆ తర్వాత అతను సారథ్యం వహించిన అన్ని టోర్నమెంట్లలో భారత్ ను నాకౌట్ దశకు చేర్చాడు.
రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ కు కూడా చేరుకుంది, అయితే ఆస్ట్రేలియాతో ఓటమిని ఎదుర్కొన్నాడు. అదే విధంగా, వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా భారత్ ను ఓడించింది. ఆ తరువాత, 2024 టీ20 ప్రపంచకప్లో రోహిత్ నాయకత్వంలో భారత్ ఛాంపియన్ నిలిచింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఫైనల్ కు చేరుకోవడంతో, రోహిత్ నాలుగు ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్ కు చేరిన మొదటి కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు.
Also Read: NZ vs PAK: బాబర్, రిజ్వాన్ లపై వేటు..! ఇక వారు టీ20ల్లో ఉండనట్టే..?
Rohit Captaincy Record: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెప్టెన్సీలో మూడు ఐసీసీ టైటిళ్లను గెలుచుకున్నాడు. అయితే, అతని కాలంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లేదు. ఈ టోర్నమెంట్ 2019 నుండి మాత్రమే ప్రారంభమైంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్ 2019 లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ కు చేరుకుంది. అయితే, 2019 వన్డే ప్రపంచకప్ మరియు టీ20 2016 ప్రపంచకప్ లో సెమీఫైనల్లోనే ఓటమిని చవిచూసింది.
రోహిత్ శర్మ ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా కూడా రికార్డ్ సృష్టించారు. ఈ మ్యాచ్లో నాథన్ ఎల్లిస్ బౌలింగ్పై మిడ్-వికెట్ మీదుగా అద్భుతమైన సిక్సర్ కొట్టారు. ఇది ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో రోహిత్ యొక్క 65వ సిక్సర్. ఈ విధంగా, క్రిస్ గేల్ యొక్క 64 సిక్సర్ల రికార్డ్ను అధిగమించారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, క్రిస్ గేల్ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్, డేవిడ్ మిల్లర్, డేవిడ్ వార్నర్, మరియు సౌరవ్ గంగూలీ వరుసగా ఉన్నారు.