Nagababu

Nagababu: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఖరారు

Nagababu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఎమ్మెల్యే కోటా అభ్యర్థిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆయనను ఎంపిక చేసి, నామినేషన్‌ దాఖలు చేయాలని సూచించారు.

కొద్దిరోజుల కిందట ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు తెదేపా, ఒకటి భాజపా తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన ఉందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. పవన్‌ కల్యాణ్‌ కోరిక మేరకు తొలుత నాగబాబును మంత్రి పదవికి పరిశీలించినా, చివరికి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని నిర్ణయించారు.

Also Read: Murder Case: వీడిన మ‌ల‌క్‌పేట శిరీష హ‌త్య కేసు మిస్ట‌రీ

ఇంతలో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత, నాగబాబుకు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ, తాజా పరిణామాల ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థిగానే ఆయన పేరును ఖరారు చేశారు. ఈ నిర్ణయం రాజకీయంగా కీలకమైనదిగా, జనసేన భవిష్యత్‌ వ్యూహంలో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *