NZ vs PAK

NZ vs PAK: బాబర్, రిజ్వాన్ లపై వేటు..! ఇక వారు టీ20ల్లో ఉండనట్టే..?

NZ vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ జట్టు ఘోరమైన ప్రదర్శన ఇచ్చి, లీగ్ దశలోనే టోర్నమెంట్ నుండి వైదొలొలిగింది. ఈ బలహీనత వల్ల సీనియర్ ఆటగాళ్ళపై దృష్టి పెట్టి, వారిని పొట్టి ఫార్మాట్ నుండి తొలగించాలని నిర్ణయం తీసుకుంది వారి బోర్డు. న్యూజిలాండ్లో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ నుండి బాబర్ ఆజామ్ మహమ్మద్ రిజ్వాన్‌లను తొలగించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరు కూడా చాలా పేలవమైన ప్రదర్శన ఇచ్చారు, దీని వల్ల పాకిస్థాన్ ఒక్క గెలుపు కూడా సాధించకుండానే నిష్క్రమించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత, పాకిస్థాన్ జట్టు మార్చి 16 నుండి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నారు. ఈ సిరీస్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టును వారి క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌లో బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్‌లను తొలగించి, యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వడానికి నిర్ణయించారు. సల్మాన్ అఘాను టీ20 జట్టు కెప్టెన్ గా నియమించారు, షాదాబ్ ఖాన్‌ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు.

Also Read: Champions Trophy 2025: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..! భారత్ జట్టు నయా రికార్డ్

NZ vs PAK: న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య మార్చి 16 నుండి టీ20 సిరీస్  మార్చి 29 నుండి వన్డే సిరీస్ జరగనున్నాయి. ఈ ఏడాది టీ20 ఆసియా కప్ ముందున్న టీ20 ప్రపంచకప్ కోసం జట్టు నిర్మాణంపై దృష్టి పెట్టాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ ప్రక్రియలో, టీ20 ఫార్మాట్‌లో యువ క్రికెటర్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్‌లను తొలగించారు. అయితే, వన్డే సిరీస్‌కు ఈ ఇద్దరిని కూడా జట్టులో ఉంచారు. షాహిన్ అఫ్రిదికి వన్డే సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు.

పాకిస్థాన్ టీ20 జట్టులో సల్మాన్ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హరీస్ రౌఫ్, హసన్ నవాజ్, జహందాద్ ఖాన్, ఖుష్దిల్ షా, మహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహమ్మద్ అలీ, మహమ్మద్ హారిస్, మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసఫ్, షహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్ ఉన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ambati Rayudu: చిరంజీవి, సుకుమార్ పై అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు..! తిట్టిపోస్తున్న నెటిజన్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *