Crime News

Crime News: గంజాయి మత్తులో ఘాతుకం!

Crime News: వాడికి మనసు అనేది లేనే లేదు. పాపం ఆ పెద్దావిడ..పూలు అమ్ముకుని రామ కృష్ణ అని జీవితాన్ని సాగిస్తూ ఉంటె …ఆమె మెడలోని బంగారం కోసం …అతి దారుణంగా చంపేశాడు ఆ నీచుడు. పాపం ఆ పెద్దవిడా …ఆ నీచుడు నగల కిశోరం ఆమెను గంజాయి మత్తులో చంపేసి …శవాన్ని గురు పట్టకుండా చంపేశాడు. చివరకు ఆమెను చంపడానికి ఉన్న కారణం చూసి …అక్కడ ఉండే వారు కూడా కన్నీరు పెట్టారు
బంగారం ఆభరణాల కోసం ఆగంతుకుడు ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. పూలు ఏరుతున్న సమయంలో ఆమె నోరు మూసేసి.. బంగారు ఆభరణాలను తస్కరించారు. గంజాయి మత్తులో ఆమెను వివస్త్రమ చేసి..ఈడ్చుకుంటూ వెళ్లి మృతదేహాన్ని రోడ్డుపై పడేశాడు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నరసన్నపేట మండలం బొంతలవీధికి చెందిన కేవీటీ గన్నెమ్మ హత్యకు గురైంది. రోజూ ఆమె సత్యనారాయణ నగర్, కామేశ్వరి నగర్‌లో చెట్లకు ఉన్న పూలు ఏరి ఆలయాల వద్ద భక్తులకు ఇచ్చేది. వారు ఇచ్చిన డబ్బులతో కుమారుడి వద్ద ఉంటూ జీవనం సాగిందచేది. కాగా, రోజూ మాదిర పువ్వుల కోసం ఆమె బయటకు వెళ్లింది. ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్న ఆగంతుకుడు.. ఆమె ముక్కుకి పెట్టుకున్న బంగారం ఆభరణాలు తస్కరించేందుకు ప్రయత్నించాడు..

ఆమె మెడపై చేయి వేసి.. నోరును మూసేసి సత్యనారాయణ స్వామి ఆలయం వైపు తీసుకెళ్లాడు.. అక్కడ ఆ బంగారు ఆభరణాలను తస్కరించాడు. ఆ సమయంలో ఏమి చేశాడో..కానీ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లి వివస్త్రగా చేసి కామేశ్వరి నగర్‌కు వెళ్లే మార్గంలో మృతదేహాన్ని పడేశాడు.. స్థానికులు ఆ వృద్ధురాలి మృతదేహాన్ని చూసి ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా..వారు సంఘటన స్థలానికి చేరుకుని గుర్తు తెలియని మృతదేహంగా అనుమానించారు.

Also Read: Hyderabad: పెళ్లయిన ఆరు నెలలకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

ముక్కు భాగం వద్ద రక్తం కారడంతో బంగారు ఆభరణాలు కోసం హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. సమీపంలో ఇళ్లను వాకబు చేశారు. ఈ క్రమంలో తన తల్లి, ఇంటికి రాలేదని బొంతలవీధికి చెందిన కేవీటీ సూర్యనారాయణ చెప్పారు. సంఘటన ప్రాంతానికి చేరుకుని ఆ మృతదేహం తన తల్లిదిగా గుర్తించి విలపించారు.

గన్నెమ్మ ఇంటి వద్ద నుంచే ఆగంతకుడు దాడికి పాల్పడినట్లు అనవాళ్లు కనిపించాయి. ఇంటిముందు భాగంలో వృద్ధురాలి చెప్పులతో పాటు పూలు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద గన్నెమ్మ చీర పడి ఉంది. అక్కడికి కొంత దూరంలో రక్తం మరకలు ఉండగా…పక్క రోడ్డులో గన్నెమ్మ మృతదేహం కనిపించింది. గంజాయి మత్తులోనే అగంతకుడు ఈ ఘటనకు పాల్పడ్డారనే ప్రచారం సాగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ALSO READ  Today Horoscope In Telugu: ఈ రాశి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *