Jai Hanuman

Jai Hanuman: జై హనుమాన్ ఇక లేనట్టేనా?

Jai Hanuman: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జా నటించిన చిత్రం ‘హను-మాన్’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’సినిమాను గతంలోనే అనౌన్స్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్.2025లో ‘జై హనుమాన్’ సినిమా రిలీజ్ అవుతుందని అప్పట్లోనే ప్రకటించాడు.

సినిమాలో కన్నడ హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్‌లో నటించనున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. కానీ, ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉన్నట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ మూవీ ‘కాంతార’ ప్రీక్వెల్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ‘జై హనుమాన్’కు డేట్స్ కేటాయించగలడు.

Also Read: Ravi Teja: వచ్చే సంక్రాంతికి మాస్ రాజా మాస్ ట్రీట్!

Jai Hanuman: ఇటు ప్రశాంత్ వర్మ కూడా వేరే చిత్రాలను తెరకెక్కించడం.. వేరే డైరెక్టర్స్‌కి కథలు అందించడంలో బిజీగా ఉన్నాడు. ఈ లెక్కన చూస్తే, ‘జై హనుమాన్’ 2025లోనే కాదు 2026 లో కూడా రిలీజ్ కావడం కష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాను ప్రారంభించి, షూటింగ్ ముగించుకుని రిలీజ్ చేయాలంటే 2027లోనే సాధ్యమవుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  RC 16: రాజధానిలో యాక్షన్ కి రెడీ అయిన గ్లోబల్ స్టార్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *