Ravi Teja

Ravi Teja: వచ్చే సంక్రాంతికి మాస్ రాజా మాస్ ట్రీట్!

Ravi Teja: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు డైరెక్షన్‌లో ‘మాస్ జాతర’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మాస్ జాతర సినిమాతో కాదు. కిషోర్ తిరుమల రవితేజ కోసం ఓ కథను రెడీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కథను రవితేజకు ఆయన వినిపించాడని.. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాను 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసే విధంగా ప్రణాళిక రెడీ చేస్తున్నారట.ఇక ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేయనున్నారట.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్.. రీమేక్ కాదు, ఒరిజినల్ మాస్ బొమ్మ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *