Prabhas Fauji: ప్రభాస్, హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై సినీ సర్కిల్స్‌లో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో ఓ బాలీవుడ్ యాక్షన్ హీరో నటించబోతున్నాడనే వార్త వినిపిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరు సంపాదించిన సన్నీ డియోల్ ప్రభాస్ ఫౌజీ లో విలన్ పాత్రలో నటించబోతున్నాడట. ఈ పీరియాడిక్ వార్ మూవీలో ప్రభాస్‌ను ఢీకొనే పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా యాక్షన్ బేస్డ్‌గా ఉంటుందట.అందుకోసం ఫౌజీ మేకర్స్ సన్నీ డియోల్‌ను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అటు ఆయన తమ్ముడు బాబీ డియోల్ ఇప్పటికే టాలీవుడ్‌లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటంతో, ఇప్పుడు సన్నీ డియోల్ కూడా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చే దాకా ఆగాల్సిందే.
