Team India

Team India: కివీస్ ను స్పిన్ తో తిప్పేసిన టీమిండియా..! సెమీస్ లో ఆసీస్ తో సై

Team India: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియా సత్తా చాటుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఆదివారం దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా 44 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో, మంగళవారం జరిగే సెమీఫైనల్‌లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు సాధించింది. శ్రేయస్ అయ్యర్ 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 79 పరుగులు చేసిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పవర్ ఫుల్ లో 30 కే 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను అతను, అక్షర్ పటేల్ ఆదుకున్నారు.

Team India:  61 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 42 పరుగులు చేసిన అక్షర్ తో పాటుగా చివర్లో హార్దిక్ పాండ్యా 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు తీయగా. కైల్ జెమీసన్, విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ తీశారు.

ఇక కటినమైన పిచ్ పైన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కేన్ విలియమ్సన్ 120 బంతుల్లో 7 ఫోర్లతో 81 పరుగులు మినహా ఇతర బ్యాటర్లు ప్రభావవంతంగా ఆడలేదు. లక్ష్యాన్ని చేధించడంలో న్యూజిలాండ్‌కు మంచి ప్రారంభం లభించలేదు. ఆరంభంలోనే రచిన్ రవీంద్ర ను అక్షర్ పటేల్ అదిరిపోయే క్యాచ్‌ ను హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో పట్టి పెవిలియన్‌కు పంపాడు.

కేన్ విలియమ్సన్ మరియు విల్ యంగ్ కలిసి పవర్ ప్లేలో 44 పరుగులు చేశారు. పవర్ ప్లే ముగిసిన తర్వాత, రోహిత్ శర్మ స్పిన్నర్లను ప్రవేశపెట్టి న్యూజిలాండ్‌ను ఇబ్బందుల్లో పడేశారు. విల్ యంగ్ వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేశారు.

Also Read: David Warner: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న డేవిడ్ వార్నర్..! ఏ సినిమాతో అంటే..

Team India: తర్వాతి బంతికే డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను కేఎల్ రాహుల్ క్యాచ్ మిస్ చేశాడు. కేన్ విలియమ్సన్ మరియు డారిల్ మిచెల్ కలిసి మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. వరుణ్ చక్రవర్తీ (5/42) ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను కుంచితం చేశారు. కుల్దీప్ యాదవ్ (2/56) రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కూడా ఒక్కో వికెట్ తీశారు.

17 పరుగులు చేసిన మిచెల్ ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశారు. టామ్ లాథమ్ ను కూడా వెంటనే జడేజా పెవిలియన్‌కు పంపాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు కేన్ విలియమ్సన్ ఓపికగా పరుగులు సాధించాడు. 77 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. గ్లేన్ ఫిలిప్స్ మరియు మైకేల్ బ్రేస్‌వెల్‌ను వరుణ్ చక్రవర్తీ వరుస ఓవర్లలో ఎల్బీగా ఔట్ చేశారు. మైకేల్ బ్రేస్‌వెల్ రివ్యూ తీసుకోకుండా మూల్యం చెల్లించుకున్నాడు. రిప్లేలో బంతి వికెట్లను తాకనట్లు తేలింది.

సెంచరీ దిశగా సాగిన కేన్ విలియమ్సన్‌ను అక్షర్ పటేల్ తన స్పెల్ చివరి బంతికి స్టంప్ ఔట్ చేశాడు. మిచెల్ సాంట్నర్ పోరాడినా, వరుణ్ చక్రవర్తీ అతన్ని కూడా వేగమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్‌లో మ్యాట్ హెన్రీ క్యాచ్ ఔట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తీకి వన్డేల్లో ఇదే తొలి ఐదు వికెట్ల హాల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *