Crime News:

Crime News: వివాహిత అనుమానాస్ప‌ద‌ మృతి.. సినీ ఫ‌క్కీలో మ‌లుపులు

Crime News: హైద‌రాబాద్ న‌గ‌రంలో అనుమానాస్ప‌ద స్థితిలో ఓ వివాహిత యువ‌తి మృతి ఘ‌ట‌న ప‌లు మ‌లుపుల‌కు తిరిగింది. సినీ ఫ‌క్కీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. హైద‌రాబాద్‌లో గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్టు ఆమె కుటుంబ స‌భ్యుల‌కు తెల‌ప‌గా, వారు హైద‌రాబాద్ ఆసుప‌త్రికి బ‌య‌లుదేరి వ‌చ్చారు. ఈ లోగా ఆమె మృతదేహాన్ని ఆమె స్వ‌స్థ‌లానికి త‌ర‌లించారు. ఈ లోగా అనుమానంతో పోలీసులు సీసీ పుటేజీ ద్వారా గుర్తించి వాహ‌నాన్ని అడ్డుకొని ప‌రిశీలించగా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

Crime News: హైద‌రాబాద్ మ‌ల‌క్‌పేటలోని జ‌మునా ట‌వ‌ర్స్‌లో నివాసం ఉంటున్న సింగం శిరీష అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందింది. శిరీష గుండెపోటుతో చ‌నిపోయింద‌ని మృతురాలి భ‌ర్త విన‌య్‌కుమార్ ఆమె కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చాడు. ఈ మేర‌కు శిరీష కుటుంబ స‌భ్యులు, ఆమె కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రికి చేరుకోక‌ముందే, విన‌య్‌కుమార్ స్వ్ర‌గ్రామ‌మైన శ్రీశైలం స‌మీపంలోని దోమ‌ల‌పెంట‌కు అంబులెన్స్‌లో త‌ర‌లించారు.

Crime News: అంబులెన్స్‌లో త‌ర‌లిస్తున్న విష‌యాన్ని సీసీ పుటేజీ ద్వారా గుర్తించిన న‌గ‌ర పోలీసులు ఆ వాహ‌నాన్ని నిలిపేశారు. అంబులెన్స్‌లో ఉన్న మృతదేహాన్ని ప‌రిశీలించ‌గా ముఖం, మెడ‌పై గాయాలున్న‌ట్టు గుర్తించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై గాయాలు ఉండ‌టంతో శిరీష‌ను కొట్టి చంపి, గుండెపోటుగా చిత్రీక‌రిస్తున్నార‌ని ఆమె కుటుంబ స‌భ్యులు మ‌ల‌క్‌పేట పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *