Transgenders: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీ, కట్టకింద కల్లు కాంపౌండ్ ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నట్లు సమాచారం అందింది. రాత్రి సమయాల్లో ట్రాన్స్‌జెండర్లు రోడ్లపై యువకులను ఆకర్షిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. స్థానికుల ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు, శనివారం రాత్రి నిఘా పెట్టి, 10 మంది ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయినవారిలో మిర్యాలగూడ వాసి పొల్లోజు సింధు, పశ్చిమ బెంగాల్, కోల్‌కతా వాసులు తియాస్ (20), జూలీ, శంకర్ ప్రమాణ్క్ (27), మహి ఘోష్ (26), సోనాబివాల్ (31), బుటియ్ (27), దియా శంకర్ (27), అమృత బెయిల్ (26), పుణ్య బైరాగ్య (33), నూర్ మొహమ్మద్ (42) ఉన్నారు. వారి నుండి 12 సెల్‌ఫోన్లు, 23 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న వారిని సరూర్‌నగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో హాజరు పరచి, బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు.
సరూర్ నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
సరూర్ నగర్ P&T కాలనీలో నివాసం ఉంటూ రెడ్ లైట్ ఏరియాగా మార్చిన ట్రాన్స్‌జెండర్లు
అర్ధరాత్రి రోడ్ల పైకి వచ్చి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తూ, ఇష్టారీతిన సెక్స్ దందా చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన… pic.twitter.com/tI6EhrAkaw
— Telugu Scribe (@TeluguScribe) March 2, 2025