Pune Rape Case: మహారాష్ట్రలోని పుణే నగరంలో పార్కింగ్‌లో ఉన్న బస్సులో యువతిపై అత్యాచారం జరిగిన ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఈ సంఘటనకు సంబంధించి నిందితుడు రామ్‌దాస్ (36)ను పోలీసులు 75 గంటల్లో పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు శ్రీరూర్లోని చెరుకు తోటలో దాక్కున్నాడు. అతడిని పట్టుకునేందుకు డ్రోన్లు, శునకదళాలను ఉపయోగించారు. నిందితుడి ఫొటోను విడుదల చేసి, ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించారు. గురువారం అర్ధరాత్రి ఆకలితో ఒక ఇంటికి తలుపు తట్టడంతో ఆ ఇంటి వ్యక్తి తనను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రామ్‌దాస్‌ను అరెస్టు చేశారు.
Also Read: Udaan Yatri Cafe: రూపాయలకే టీ.. 20 రూపాయలకే వడ.. ఎయిర్ పోర్ట్ లో స్పెషల్ క్యాంటీన్
ఈ దారుణం మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో, పుణేలోని స్వర్గేట్ బస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు వచ్చిన యువతిని నిందితుడు తనతో మాటలు కలిపి, “అక్కా” అని నమ్మబలికాడు.
గ్రామానికి వెళ్లే బస్సు మరోచోట ఉందని చెప్పి, బస్‌స్టేషన్‌లోనే వెలిసిపోయిన ఓ బస్సు దగ్గరకు తీసుకెళ్లాడు.
యువతి బస్సులోకి వెళ్లేందుకు సందేహించగా, “లోపల ప్రయాణికులు ఉన్నారు, నిద్రలో ఉన్నందున లైట్లు వేసుకోలేదు” అని నమ్మించాడు. లోపలికి వెళ్లగానే బస్సు తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని దత్తాత్రేయ రామ్దాస్గా గుర్తించారు. అతనిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్‌పై బయట ఉన్నాడు అని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు 13 ప్రత్యేక బృందాలు, వాటిలో 8 క్రైమ్ బ్రాంచ్ టీమ్‌లు ఏర్పాటుచేశారు.
