Akash Puri

Akash Puri: ఆకట్టుకుంటున్న ఆకాష్ పూరీ ‘తల్వార్’ ఆడియో గ్లింప్స్!

Akash Puri: పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి తాజాగా నటిస్తున్న సినిమా తల్వార్. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆకాష్ పూరి చెప్పే ఓ సాలిడ్ డైలాగ్ మనకు ఈ ఆడియో గ్లింప్స్‌లో వినిపిస్తుంది. ధర్మం, అధర్మానికి మధ్య జరిగే యుద్ధం బ్యా్క్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ సాగబోతుందని ఈ డైలాగ్ వింటే అర్థమవుతుంది. ఆడియో గ్లింప్స్‌తో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశారు మేకర్స్.ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, అజయ్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాశి పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాకు కేశవ కిరణ్ సంగీతం అందిస్తుండగా వార్నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై భాస్కర్ ఈఎల్‌వి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *