Mazaka Movie Review: సందీప్ కిషన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా త్రినాధ రావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా మజాకా. నేడు విడుదల అయ్యింది. ప్రమోషన్ కంటెంట్ తో విడుదలకు ముందే అంచనాలు పెంచేసిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా B, C సెంటర్స్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. వారికి మజాకా పండగలాంటి సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.లాజిక్స్ ఆలోచించకుండా ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, మురళీ శర్మ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అలాగే సందీప్, రీతూ వర్మ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మొత్తానికి ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమాకి వసూళ్లు ఏమాత్రం వస్తాయో చూడాలి.
