Kishan reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం ఇప్పుడు మొండి హస్తంలా మారిపోయిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని, నిరుద్యోగులు మరియు ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిరోజూ కొత్త కొత్త ప్రకటనలు చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో ఎలాంటి అభివృద్ధి కనిపించడంలేదని విమర్శించారు. “రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు కనిపించడంలేదు. కేవలం 14 నెలల పాలనలోనే ప్రజావ్యతిరేకత పెరిగిపోయింది తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.