Director Shankar: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శంకర్ ఆస్తులను సీజ్ చేయడం, సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది.శంకర్‌కి చెందిన చెన్నైలోని మూడు ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద అటాచ్ చేశారు. ఈ ఆస్తుల విలువ దాదాపు రూ.10 నుంచి 11 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ చర్యలపై శంకర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఇది పూర్తిగా అన్యాయమని, చట్టపరంగా సవాల్ చేస్తానని స్పష్టం చేశారు.
Also Read: Chhaava vs Pushpa 2: పుష్ప2 ని దాటేసిన చావా..
మద్రాస్ కేసు కోర్టు అప్పుడే తోసిపుచ్చిన తర్వాత ఈడీ ఇలా వ్యవహరించడం ఆశ్చర్యకరంగా ఉందని, మద్రాస్ హైకోర్టు ఆరూర్ తమిళ్‌నాడాన్ పిటిషన్‌ను పూర్వం పూర్తిగా కొట్టిపారేసిందని అన్నారు. పాత ఆరోపణల ఆధారంగా ఇప్పుడు తన ఆస్తులను సీజ్ చేయడమేంటని శంకర్ తన అసంతృప్తిని బయటపెట్టారు.
ఆధారాలు లేకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని, తన ఆస్తులపై ఈడీ ఉంచిన ఆంక్షలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడతానని శంకట్ మరో వివరణ ఇచ్చారు.