Mahakumbh Mela

Mahakumbh Mela: మహాకుంభమేళాలో చివరి వీకెండ్.. భక్త జన సందడి మామూలుగా లేదు..

Mahakumbh Mela: మహా కుంభమేళా చివరి వారాంతంలో, ప్రయాగ్‌రాజ్‌లో ప్రవేశ ద్వారం నుండి నగరం లోపలి వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 500 మీటర్ల దూరం ప్రయాణించడానికి ప్రజలకు దాదాపు రెండు గంటలు పడుతోంది.
ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునే వాహనాలను సంగంకు 10 కి.మీ ముందు ఆపివేస్తున్నారు. ఆ తరువాత, ప్రజలు మిగిలిన దూరాన్ని కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. మరోవైపు, వీఐపీల వాహనాలు మాత్రం ఆరైల్ ఘాట్ వరకు వెళ్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను భక్తులు వీలైనంత తక్కువ దూరం నడిచే విధంగా ఏర్పాట్లు చేయాలని అంతకు ముందు రోజు కోరారు. కానీ శుక్రవారం దాని ప్రభావం కనిపించలేదు. శనివారం కూడా ఆ పరిస్థితిలో మార్పు లేదు.
ఇంతలో, నగరంలో ట్రాఫిక్ జామ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఫిబ్రవరి 24న 10వ తరగతి-12వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించకూడదని అధికారులు నిర్ణయించారు. ఈ రోజు పరీక్ష మార్చి 9న ఇర్వహిస్తారు.
మహా కుంభమేళాకు శుక్రవారం 40వ రోజు. జాతర ముగియడానికి ఇంకా 5 రోజులు మిగిలి ఉన్నాయి. రాత్రి 8 గంటల నాటికి 1.28 కోట్ల మంది భక్తులు సంగమంలో స్నానాలు ఆచరించారు. ఇప్పటివరకు మొత్తం దాదాపు 59.31 కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారు.

ఇది కూడా చదవండి: Railway Officials: రైలు ఇంజిన్ డ్రైవర్లను కూల్ డ్రింక్స్ నీళ్లు తాగొద్దన్న అధికారులు.. ఏమి జరిగిందంటే..

రద్దీ కారణంగా, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే – వచ్చే 8 రైళ్లు ఫిబ్రవరి 28 వరకు రద్దు చేయబడ్డాయి. 4 రైళ్ల రూట్లు మార్చారు. . ప్రయాగ్‌రాజ్ (UP-70) లో నమోదు చేసుకున్న వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతిస్తున్నారు.

మహాశివరాత్రికి అత్యవసర వైద్య సౌకర్యాలు..
మహాశివరాత్రి నాడు మహా కుంభమేళాలో సంగమ స్నానమాచరించేందుకు వచ్చే కోట్లాది మంది భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, యోగి ప్రభుత్వం ఆరోగ్య సేవలను అపూర్వమైన రీతిలో బలోపేతం చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక సూచనల మేరకు, ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ (SRN) ఆసుపత్రిలో అత్యవసర వైద్య సౌకర్యాలను పెంచారు. అలాగే, ఇక్కడికి వచ్చే భక్తులకు ఆరోగ్య పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి ఐసియు పడకల సంఖ్యను 147 కు పెంచారు.
ప్రధాన ICUలు ఈ క్రింది విధంగా ఉన్నాయి-
కార్డియాలజీ విభాగం: 23 పడకలు
సర్జికల్ ఐసియు: 10 పడకలు
పీడియాట్రిక్ ఐసియు: 10 పడకలు
నవజాత శిశువుల ICU: 15 పడకలు
గైనకాలజీ & ప్రసూతి ICU: 8 పడకలు
ట్రామా ఐసియు: 10 పడకలు
మెడిసిన్ ఐసియు: 20 పడకలు
న్యూరోసర్జరీ ఐసియు: 10 పడకలు
గ్యాస్ట్రోఎంటరాలజీ ఐసియు: 6 పడకలు
శ్వాసకోశ వ్యాధుల ఐసియు: 6 పడకలు
న్యూరాలజీ ఐసియు: 10 పడకలు

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *