Chhaava Movie: బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఛావా”. బాలీవుడ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా సాలిడ్ రెస్పాన్స్ తో భారీ వసూళ్లు అందుకుంటూ దూసుకెళ్తుంది. అయితే శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఈ సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అయ్యినప్పటికీ ఇండియా వైడ్ గా ఈ సినిమా పేరు వినిపిస్తుంది.
అయితే ఇలాంటి సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ చేయాలని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మిగతా భాషల్లో ఏమో కానీ మన తెలుగు ఆడియెన్స్ చేస్తున్న రేంజ్ డిమాండ్ మాత్రం మరో భాష నుంచి కనిపించడం లేదని చెప్పాలి.
ఇది కూడా చదవండి: Kannappa Making Video: పాత్రలో జీవించాడు గా మంచు విష్ణు.. సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
తెలుగు డబ్బింగ్ ని రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ మరింత పెరుగుతూ వస్తుంది. అయితే మేకర్స్ దీనిపై ఇంకా ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో తెలుగులో విడుదల లేనట్టే అని తెలుస్తుంది. మరి చూడాలి తెలుగు రిలీజ్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుంది అనేది.
ఛావా | అధికారిక ట్రైలర్ | విక్కీ కె | రష్మిక ఎం | అక్షయే కె | దినేష్ విజన్ | లక్ష్మణ్ యు | 14 ఫిబ్రవరి