Rekha Gupta:

Rekha Gupta: ఢిల్లీ తొమ్మిదో సీఎంగా రేఖాగుప్తా ప్ర‌మాణ‌స్వీకారం.. మ‌రో ఆరుగురు మంత్రులు కూడా..

Rekha Gupta:ఢిల్లీ తొమ్మిదో ముఖ్య‌మంత్రిగా రేఖాగుప్తా గురువారం (ఫిబ్ర‌వ‌రి 20న‌) ప‌ద‌వీప్ర‌మాణ స్వీకారం చేశారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానం భారీగా హాజ‌రైన ఎన్డీయే పార్టీల‌ శ్రేణుల హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య ఆమెతోపాటు మ‌రో ఆరుగురు మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. వారిచేత ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి దేశంలోని వివిధ రాష్ట్రాల బీజేపీ, ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు.

Rekha Gupta:ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప‌ద‌వీ ప్ర‌మాణం స్వీకార కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. దేశంలోని 12 రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

Rekha Gupta:రేఖాగుప్తాతోపాటు మంత్రులుగా ప‌ర్వేశ్ వ‌ర్మ‌, క‌పిల్ మిశ్రా, మజింద‌ర్‌సింగ్ సిర్సా, ఆశిష్ సూద్‌, పంక‌జ్ సింగ్‌, ర‌వీందర్ ఇంద్ర‌జ్ సింగ్ ప‌ద‌వీ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. వీరిలో తొలి నుంచి ముఖ్య‌మంత్రి బ‌రిలో ఉంటార‌ని విశేష ప్ర‌చారం జ‌రిగిన ప‌ర్వేశ్ వ‌ర్మ‌ను ఉప ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించి, కీల‌క శాఖ‌ల‌ను అప్ప‌గించే అవ‌కాశం ఉన్న‌ది.

Rekha Gupta:ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మానికి ముందుగా రేఖాగుప్తా హ‌నుమాన్ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. రామ్‌లీలా మైదానికి వెళ్లే దారిలో ఉన్న మ‌ర్గ‌ట్‌వాలే బాబా గుడిలో ఉన్న హ‌నుమాన్ ఆల‌యాన్ని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mulugu: మాకు ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్యం.. అనుమ‌తించండి క‌లెక్ట‌ర్ సార్‌.. దంప‌తుల వేడుకోలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *