Suspended

Suspended: ఏపీలో వీరంతా అండర్ సస్పెన్షన్ . . వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ .

Suspended: వారంతా మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని దైవాంస సంభూతిడిగా చూశారా? అయ‌న చేప్పిందే వేదంగా భావించారు..భార‌త రాజ్యాంగానికి వ‌క్ర‌భాష్యం చేప్పారు.. జ‌గ‌న్ రాజ్యాంగానికే జై కోట్టారు..జ‌గ‌న్ అధికారంలో వారంతా అధికారం చెలాయించారు..చ‌ట్టాన్ని కాపాడాల్సిన వారు దాన్ని తుగంలోతోక్కారు..న్యాయం కోసం అల‌మ‌టించిన వారికి అన్యాయ‌మే జ‌రిగింది..నోరెత్తితే అక్ర‌మా కేసులు , అక్ర‌మ కేసులు పెట్టారు..ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు..ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసం కంటే .. జ‌గ‌న్ మెప్పుకోసం ప‌ని చేశారు..దాని ఫ‌లితం ఇప్పుడు అనుభ‌విస్తున్నారు..ఎవ‌రు వారంతా… వారంతా ఏం చేశారు.

చ‌దువుకునే రోజుల్లో వారంతా గోప్ప‌క‌ల‌లు క‌ని వాటిని సాధించుకున్నారు.. అనుకున్న‌ట్లుగానే ఉన్న‌త శిఖ‌రాలకు చేరారు.. అదంతా గ‌తం ప్ర‌స్తుతం వారంతా తీవ్ర అరోప‌ణ‌లు, పేరుతో పోస్టింగ్ ల‌కు దూరంగా, త‌ప్పు చేసిన వారిపై కేసులు న‌మోదు చేసే వారు.. ఇప్పుడు వారిపైనే కేసులు న‌మోదవుతున్నాయి.. వారంతా ఐపిఎస్ అధికారులు..చ‌ట్టాన్నికాపాడం వీరి ధ‌ర్మం..బాధితులు ప‌క్షాన నిల‌బ‌డ‌మ‌ని చ‌ట్టం చేపుతుంది.అధికారంలో ఉన్న పాల‌కుడి అదేశాల‌కంటే రాజ్యాంగ ప్ర‌కారమే న‌డుచుకోవాలి .. అదే స‌మ‌యంలో చ‌ట్టం ప్ర‌కారం ప‌ని చేయాలి..కానీ జ‌గ‌న పాల‌న‌లో ఐదేళ్ల పాటు అక్ర‌మాల‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు..భార‌త రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కారు.. జ‌గ‌న్ రాజ్యాంగాన్ని అమ‌లు చేశారు.బాధితుడునే దోషిగా చూపారు.. న్యాయం కోసం వ‌స్తే..అలాంటి వారికి అన్యాయమే ఎదురైయ్యేది..ఎస్సీ ల‌పైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం క్రింద కేసులు న‌మోదు చేశారు… ప్ర‌భుత్వాలు మార‌తాయి..పాల‌కులు మార‌తారు అని వారు భావించ‌లేదు..జ‌గ‌నే శాశ్విత‌ సియం గా భావించారు..ప్ర‌తిఫ‌లంగా ఈ ప్ర‌భుత్వంలో సస్పెన్ష‌న్లు,వెయిటింగ్ ఫ‌ర్ పోస్టింగ్ లు..ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప‌లువురు ఐపిఎస్ అధికారులు తీరు..ఇదే త‌ర‌హాలో మ‌రికొంత మంది ఐఏఎస్ అధికారులు కూడా పోస్టింగ్ ల కోసం ఎదురు చూస్తున్నారు.

పీఎస్ఆర్ ఆంజ‌నేయులు.1992 బ్యాచ్ ఐపిఎస్ అధికారి… డీజీపి ..హోదా లో ఉన్నారు….గత ప్ర‌భుత్వంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌,ట్రాన్స్ పోర్టు క‌మిష‌న‌ర్, కీల‌క బాధ్య‌తల్లో ప‌ని చేశారు..ప్ర‌స్తుతం అండ‌ర్ సస్పెష‌న్ లో కొన‌సాగుతున్నారు..మాజీ సియం జ‌గ‌న్ కు అన్ని తానై ఉన్న అధికారిగా ఉన్నారు..గ‌తంలో అప్ప‌టి ప్ర‌తిప‌క్ష‌నేత ప్ర‌స్తుత సియం చంద్ర‌బాబు ప‌ట్ల చాలా అవ‌మాన క‌రంగా వ్య‌వ‌హరించార‌న్న అరోప‌ణ‌లు ఉన్నాయి..ఇదే స‌మ‌యంలో ముంబాయి సినిమా న‌టి జ‌త్వానీ ని కేసులు ఇరికించార‌న్న అరోప‌ణ‌ల‌తో అయ‌న పై రాష్ట్ర ప్ర‌భుత్వం సెప్టెంబ‌ర్ 15 న అయ‌న పై స‌స్పెష‌న్ వేటు వేసింది…పీఎస్ అర్ అంజ‌నేయులు తో పాటు జ‌త్వానీ వ్య‌వ‌హారంలో విజ‌య‌వాడ మాజీ పోలీస్ క‌మీష‌న‌ర్ ఐజీ ర్యాంక్ అధికారి 2004 బ్యాచ్ ఐపియ‌స్ అధికారి కాంతిరాణా తాతా,డిఐజి ర్యాంక్ లో ఉన్న 2010 ఐపియ‌స్ బ్యాచ్ అధికారి విశాల్ గున్నిల‌ను ప్ర‌భుత్వ స‌స్పెండ్ చేసింది..ఇదే స‌మ‌యంలో వీరు ముగ్గురు పై కేసు న‌మోదు తో పాటు విచార‌ణ జ‌రుగుతుంది

Suspended: గ‌త ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన సిఐడీ చీఫ్ గా ప‌ని చేసిన‌ 1994 బ్యాచ్ కు చెందిన ఐపియ‌స్ అధికారి పివి సునీల్ కుమార్ కుట‌మి ప్ర‌భుత్వం గ‌త ఏడాది జూన్ 21న అయ‌న్ని బ‌దిలీ చేసి డీజీపి ఆఫీసుకు ఎటాచ్ చేసింది..జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో టీడిపి నేత‌లు టార్గెట్ చేసి మ‌రి సిఐడి కేసులు న‌మోదు చేశారు..సోష‌ల్ మీడియాలో పోస్టుల పేరుతో వంద‌ల మంది టీడిపి కార్య‌క‌ర్త‌ల పై సిఐడి కేసులు నమోదు చేసింది..అన్నింటి క‌న్నా దారుణంగా సోంత పార్టీ ఎంపీ ర‌ఘురామ కృష్టం రాజు పై కేసు పెట్ట‌డ‌మే కాకుండా దారుణంగా చంపాల‌ని చూశారు..సునీల్ కుమార్ అరాచ‌కంపై మాజీ ఎంపి, ప్ర‌స్తుతం ఎపి అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణం రాజు కేసు నమోదు చేశారు..ప్ర‌స్తుతం అయ‌న పెట్టిన కేసులో సునీల్ కుమార్ అరాచ‌కాలు అన్ని ఒక్కోక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి..ప్ర‌స్తుతం అయ‌న్ని ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది..

పివి సునీల్ కుమార్ నుండి సిఐడి చీఫ్ గా త‌రువాత భాద్య‌త‌లు తీసుకున్నారు 1994 బ్యాచ్ ఐపిఎస్ అధికారి ఎన్ సంజ‌య్.. సంజ‌య్ వ్య‌వ‌హ‌రించిన తీరు అఖిల భార‌త అధికారులు స‌ర్వీసు రూల్స్ కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రించారు..ఏకంగా అప్ప‌టి మాజీ సియం,ఇప్ప‌టి ఎపి ప్ర‌స్తుత సియం చంద్ర‌బాబు నాయుడు పై స్కిల్ డ‌వ‌ల‌ఫ్మెంట్ కేసులో చంద్ర‌బాబు ను అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డంతో పాటు..అయ‌న పై సిఐడి చేస్తున్న ద‌ర్యాప్తును దేశం న‌లుమూల ప్రెస్ మీట్లు పెట్టి మ‌రి చెప్పారు..అదే సంద‌ర్భంలో అయ‌న అనేక అంశాల్లో ప్ర‌భుత్వ నిభంద‌న‌ల‌ను తుంగ‌లో తోక్కారు..సుద్ద పూస‌లాగా నీతి వ్యాఖ్యాలు చేప్పిన సంజ‌య్ అయ‌న ఫైర్ డీజీ గా చేసిన క్ర‌మంలోను, అలాగే, సిఐడి చీఫ్ గా ఉన్న స‌మ‌యంలో రెండు చోట్ల భారీగా ప్ర‌భుత్వ నిధులు దుర్వినియోగం చేశారు..దీంతో అయ‌న్ని ప్ర‌భుత్వం ఎన్ సంజ‌య్ ను గ‌త ఏడాది డిసెంబ‌ర్ 3న‌ సస్పెండ్ చేసింది..అయ‌న చేసిన అక్ర‌మాల‌పై ద‌ర్యాప్తు చేస్తోంది..త్వ‌ర‌లో అయ‌న్ని ద‌ర్యాప్తు సంస్థ‌లు విచార‌ణ కు పిలిచే అవ‌కాశం ఉంది..

ALSO READ  Visakhapatnam Yoga Event: 7న రాష్ట్రవ్యాప్తంగా ‘యోగా డే’ అవగాహన ర్యాలీలు

జ‌గ‌న్ సియం గా ఉన్న స‌మ‌యంలో 2014 – 2019 మ‌ధ్య కాలంలో అప్ప‌టి టిడిపి ప్ర‌భుత్వంలో తీసుకున్న నిర్ణ‌యాల‌పై ద‌ర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసింది..దానికి 2006 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన కొల్లి ర‌ఘురామి రెడ్డి ని సిట్ చీఫ్ గా నియ‌మించింది..అయ‌న కీల‌క‌మైన రాజ‌ధాని, ఇత‌ర డిపార్ట్మెంట్ల ల‌లో ప్ర‌భుత్వం తీసుకున్న విధాన నిర్ణ‌యాల‌పై సిట్ ద‌ర్యాప్తు చేసింది..అయితే అందులో ఎలాంటి ఆదారాలు లేకున్నా అప్ప‌టి సియం జ‌గ‌న్ ను సంతృప్తి ప‌ర‌చ‌డానికి స్కిల్ కేసులో అప్ప‌టి మాజీ సియం చంద్ర‌బాబు ను నంద్యాల‌లో అర్ధ‌రాత్రి ఆరెస్ట్ చేశారు..ఇదే స‌మయంలో నంద్యాల నుండి అయ‌న్ని కారులోనే తాడేప‌ల్లి లోని సిఐడి కార్యాల‌యానికి త‌ర‌లించారు..అయ‌న సిట్ చీప్ ఉన్న స‌మ‌యంలో అనేక త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోని ప్ర‌స్తుతం డీజీపి కార్యాల‌యానికి అటాచ్ లో ఉన్నారు..

Suspended: ఇదే క్ర‌మంలో 2010 ఐపిఎస్ బ్యాచ్ అధికారి సి.విజ‌య‌రావు ఇయ‌న గుంటూరు రూర‌ల్ ఎస్పీ గా, క‌ర్నులు డిఐజి గా ప‌ని చేశారు..మాజీ సియం జ‌గ‌న్ ఏది చేపితే అది నిభంద‌న‌లుకు విరుద్దం అయినా… సియం అదేశాల‌నే పాటించార‌న్న అరోప‌ణ‌లు ఉన్నాయి.. జీవో నెంబ‌ర్ 1 పేరుతో టీడిపి నేత‌ల‌ను వేదించ‌డం చేశారు… నారా లోకేష్ విష‌యంలో కూడా ఉన్నారు..ఆర్ ర‌విశంక‌ర్ రెడ్డి 2022 బ్యాచ్ ఐపియ‌స్ అధికారి ఇయ‌న జ‌గ‌న్ పాల‌నలో సియంఓ కార్యాల‌యం అదేశాల మేర‌కే ప‌ని చేశారు..ప‌ల్నాడు ఎస్పీగా ఉండ‌గా మెన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో టిడిపి నాయ‌కులు హ‌త్యాలు జ‌రిగినా స‌క్ర‌మంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్న అరోప‌ణ‌ల‌తో కేంద్రం ఎన్నిక‌ల సంఘం అన్ని గ‌త ఏడాది ఏప్రియ‌ల్ లో 3న బ‌దిలీ చేసింది…అప్ప‌టి నుండి అయ‌నకి ప్ర‌భుత్వం ఏలాంటి పోస్టింగ్ ఇవ్వ‌కుండా డీజిపి అఫీసు ఎటాచ్ లోనే ఉన్నారు.. వై.రిషాంత్ రెడ్డి 2016 బ్యాచ్ ఐపిఎస్ గ‌త ఏడాది జూన్ 21 బ‌దిలీ చేసింది.. ఇయ‌న చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉండా పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డి మాటే వేదంగా ప‌ని చేశారు..టీడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న సోంత జిల్లాలో ప‌ర్య‌ట‌న‌కు కూడా అనేక అడ్డంకులు సృష్టించార‌న్న అరోప‌ణలు ఉన్నాయి..కే. ర‌ఘువీర్ రెడ్డి 2022 బ్యాచ్ ఐపిఎస్ అధికారి.

ఈయ‌న్ని గ‌త ఏడాది జూలై 15న బ‌దిలీ చేసింది. నంద్యాల ఎస్పీ చేసిన స‌మ‌యంలో అధికార వైసిపికి కోమ్ముకాసార‌న్న అరోప‌ణ‌లు ఉన్నాయి.. ఈ ప్ర‌బుత్వం వ‌చ్చాక అయ‌న్ని బ‌దిలీ చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వ‌కుండా అయ‌న్ని వెయిటింగ్ లో పెట్టింది..పి. ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి. 2022 బ్యాచ్ ఐపిఎస్ అధికారి ఇయ‌న్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తిరుప‌తి ఎస్సీగా ప‌ని చేసే స‌మ‌యంలో ఎన్నిక‌ల్లో వైసిపికి అనుకూలంగా వ్య‌వ‌హరించార‌న్న అరోప‌ణ‌ల‌తో బ‌దిలీ చేసింది..

ఇయ‌న పూర్తి గా వైసిపి ముద్ర వేయించుకున్నారు… గ‌త ఏడాది ఎప్రియ‌ల్ 3 నుండి అయ‌న ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఇప్ప‌టికి వెయిటింగ్ లో ఉన్నారు..పి.జాషువా..2022 బ్యాచ్ ఐపిఎస్ అధికారి ఇయ‌న కృష్ణా జిల్లా ఎస్పీ గా ప‌ని చేసే స‌మ‌యంలో ఇయ‌న్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ‌త ఏడాది ఎప్రియ‌ల్ 3న‌ బ‌దిలీ చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హైద‌రాబాద్ నుండి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి వ‌చ్చే ప్ర‌త్యేక విమానానికి అనుమ‌తి ఇవ్వ‌వ‌ద్ద‌ని ఎయిర్ పోర్ట్ అధికారులకు లేఖ రాశారు..ఇదే స‌మ‌యంలో పూర్తి వైసిపి అనుకూల ముద్ర వేయించుకున్నారు..

ALSO READ  PM Kisan Yojana: PM కిసాన్ 19వ విడత అందలేదా? కారణం ఏమిటో.. ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలుసుకోండి

ఇది కూడా చదవండి: Bangalore: మా అత్తగారిని చంపేయాలి.. మాత్రలు ఇవ్వండి.. మహిళ చేసిన పనికి డాక్టర్ షాక్..

ఇక ఐఏఎస్ అధికారులు కూడా స‌ర్వం జ‌గ‌న్నామ స్మ‌ర‌ణ చేసినారు..అందులో కీల‌మైన సినియ‌ర్ ఐఏఎస్ అధికారి వై శ్రీ లక్ష్మి.. ఈమే 1988 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ .. అంతా స‌వ్యంగా ఉంటే అమే కేంద్రంలో కేంద్ర క్యాబినెట్ కార్య‌ద‌ర్శిగా ఉండే వారు..2004 – 2009 మ‌ధ్య కాలంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సియం గా ఉన్న స‌మ‌యంలో మైనింగ్ కార్య‌ద‌ర్శిగా ఉన్నారు..అ స‌మ‌యంలో ఓబులా పురం మైనింగ్ విష‌యంలో గాలి జ‌నార్ధన్ రెడ్డికి అనుకూలంగా వ్య‌వ‌హారించారన్న ఆరోప‌ణ‌ల్లో సిబిఐ అమేను అరెస్ట్ చేసింది..దాదాపు 5 ఏళ్ల పాటు స‌స్పెష‌న్ లోనే ఉంది.. ఐదేళ్ల త‌రువాత అమే స‌స్పెష‌న్ అప్ప‌టి ప్ర‌భుత్వం ఎత్తివేసింది..అమే విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణా రాష్ట్రం కు కేటాయింపుకోసం అప్లైయ్ చేశారు..

Suspended: అయితే ఏపిలో వైఎస్ జ‌గ‌న్ సియం కాగే ఏపికి వ‌చ్చి అన‌తికాలంలోనే నిభంద‌ల‌ను తుంగ‌లో తొక్కి వెంట‌నే ముఖ్య కార్య‌ద‌ర్శిగా,, అనంత‌రం ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి పొంది మున్సిప‌ల్ శాఖ భాద్య‌త‌లు చూశారు..మూడు రాజ‌ధానులు వ్య‌వ‌హారంలో కూడా శ్రీ ల‌క్ష్మీ కీల‌కంగా ప‌ని చేశారు..అయితే..జ‌గ‌న్ అధికారం తిరిగి నిల‌బెట్టుకుంటారు..వైజాగ్ కు రాజ‌ధాని త‌ర‌లించే పని ఈమే కు అప్ప‌గించారు… రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ అధికారంలోకి రావ‌డం తోనే గ‌త ఏడాది జూన్ 20న బ‌దిలీ చేసి.. సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌లో రిపోర్ట్ చేశారు.. అప్ప‌టి నుండి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు..

ఇక డి.ముర‌ళీధ‌ర్ రెడ్డి 2012 ఐఏఎస్ బ్యాచ్ కు చేందిన అధికారి..జ‌గ‌న్ పాల‌నలో కీల‌మైన కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ గా ప‌ని చేశారు..కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్ర శేఖ‌ర్ రెడ్డి మాటే వేదంగా ప‌ని చేశారు..ఇత‌ర వైసిపి ప్ర‌జాప్ర‌తినిధుల‌ను పురుగుల్లాగా చూసే వార‌న్న అరోప‌ణ‌లు ఉన్నాయి..అనంతరం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ ఇన్ఫ్రాస్ట‌క్ష‌ర్ కార్పోరేష‌న్ ఎండిగా పని చేశారు..ముర‌ళీధ‌ర్ రెడ్డి పై తీవ్ర మైన అవినీతి అరోప‌ణ‌లు ఉన్నాయి..ఇయ‌న వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి సియంగా ఉన్న స‌మ‌యంలో అయ‌న పై సిబిఐ కేసు నమోదు చేసింది..ఇప్ప‌టికి అకేసు విచార‌ణ జ‌రుగుతూనే ఉంది..ముర‌ళీధ‌ర్ రెడ్డిని కుట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చాక అన్ని గ‌త ఏడాది జూన్ 20న బ‌దిలీ చేసింది..అప్ప‌టి నుండి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు..

Suspended: రేవు ముత్యాల రాజు 2007 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి..గ‌తంలో ముఖ్య‌మంత్రి కార్యాలయంలో ప‌ని చేశారు..అయ‌న పై అనేక ర‌కాల అవినీతి అరోప‌ణ‌లు ఉన్నాయి..కుట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చాక బ‌దిలీ చేసింది..గ‌త 8 నెల‌లుగా పోస్టింగ్ కోసం వేయింటింగ్ లో ఉన్నారు..ఇక కె. మాధ‌వి ల‌తా రెడ్డి 2018 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారిణి..2019 లో వైసిపి అధికారంలోకి రాగానే ఉమ్మ‌డి కృష్ణా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ గా ప‌ని చేశారు..జిల్లాల్లో జ‌రిగిన అనేక భూముల అక్ర‌మాల్లో అమే పేరు వినిపించింది..అనంత‌రం బ‌దిలీ పై ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ గా పని చేశారు..

అంతా సియం జ‌గ‌న్ అదేశాలే త‌ప్పా ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను అంతగా కేర్ చేసేది కాద‌ని చేపుతారు..ఇక గ‌తంలో సియం జ‌గ‌న్ కార్య‌ద‌ర్శిగా అంతా తానై చ‌క్రం తిప్పిన ధ‌నుంజ‌య్ రెడ్డి ద‌గ్గ‌ర ఓఎస్డీగా ప‌ని చేసిన కె నిల‌కంఠా రెడ్డి సియం కార్య‌ల‌య కేంద్రంగా అనేక వ్య‌వ‌హారాలు న‌డిపార‌న్న అరోప‌ణ‌లు ఉన్నాయి..ముఖ్యంగా నిబంధ‌ల‌న‌కు విరుద్దంగా నిల‌కంఠా రెడ్డికి ఐఏఎస్ గా ప‌దోన్న‌తి ఇచ్చంది అప్ప‌టి జ‌గ‌న్ స‌ర్కార్.. కుట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత గ‌త ఏడాది జూలై లో బ‌దిలీ చేసింది..అప్ప‌టి నుండి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *