Achemnaidu: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని, ఆయన పాలనా విధానం సిగ్గుచేటుగా మారిందని ఆరోపించారు.
మిర్చి రైతులకు మద్దతు ధరపై హామీ
రాష్ట్రంలోని మిర్చి రైతులకు సరైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. “మిర్చికి మద్దతు ధర పెంచితే, అంతకుమించిన ధర రావడం కష్టమవుతుంది. రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు
రైతు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యంగా, వ్యవసాయ సంబంధిత అనేక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలవనున్నారు అని వెల్లడించారు.
రైతుల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
రైతులకు లాభదాయకమైన విధానాలను అమలు చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి రైతుకు మేలు చేసే విధంగా వ్యవసాయ విధానాలను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని, వారికోసం అన్ని విధాల సహాయం అందిస్తామని అచ్చెన్నయుడు తెలిపారు.

