Delhi::న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ స్పందించింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ద్వారా మాత్రమే విచారణ జరుగుతోందని స్పష్టం చేసింది.
నార్త్ రైల్వే ఇప్పటికే ఇద్దరు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.ఘటనపై జరుగుతున్న విచారణను తప్పుదారి పట్టించేలా కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.ప్రత్యేకంగా, RPF విచారణ జరుగుతోందని కొన్ని వార్తామాధ్యమాలు ప్రచారం చేశాయని, ఇది అసత్యమని రైల్వే శాఖ ఖండించింది.
ఉన్నత స్థాయి కమిటీ తొక్కిసలాటపై సమగ్ర దర్యాప్తు చేపడుతోంది.ఈ కమిటీ నిర్వహించే విచారణ తప్ప ఇంకా ఎలాంటి విచారణలు జరగడం లేదు అని స్పష్టంచేసింది.

