Cm revanth: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన కొత్త రేషన్‌కార్డుల డిజైన్లను పరిశీలించి, వీటి జారీకి తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాల్లో ఎన్నికల నియమావళి (కోడ్) అమలులోకి వచ్చింది. అయితే, కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకుంటుండటం గమనార్హం. ఈ విషయంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించి, అనవసరంగా మళ్లీ దరఖాస్తు చేయకుండా చూడాలని అధికారులకు సీఎం సూచించారు.

