USA

USA: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి

USA: అమెరికాలోని ప్ర‌ముఖ తెలుగు సంఘం ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA)’ నూతన బోర్డు కొలువుదీరింది. నూతన అధ్యక్షుడిగా రమణ కృష్ణ కిరణ్, సలహా మండలి సభ్యుడిగా మాటా ఫౌండర్ శ్రీనివాస్ గనగోని ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా.. మాటా నూత‌న అధ్య‌క్షునిగా రమణ కృష్ణకిరణ్ దుద్దాగి ప్ర‌మాణ స్వీకారం చేశారు. డల్లాస్‌లో జ‌రిగిన‌ ‘మాటా’ నూత‌న‌ బోర్డు సమావేశంలో సమానత్వానికి ప్రతిబింబంగా భగవద్గీత, బైబిల్, ఖురాన్ బ‌బ‌మంత్రాల పఠనం మ‌ధ్య‌ రమణ కృష్ణకిరణ్ దుద్దాగి బాధ్యతలు స్వీకరించారు. 2025-2026 వ్యవధికి రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి అధ్య‌క్షునిగా కొన‌సాగుతారు.

ఈ సంద‌ర్భంగా ‘మాటా’ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని సలహా మండలి సభ్యుడిగా (Advisory Council Member) బాధ్యతలు స్వీకరించారు. MATA అభివృద్ధి, ల‌క్ష్యాల సాధ‌న కోసం శ్రీనివాస్ గనగోని అనుభవం, మార్గదర్శకత్వం కొన‌సాగ‌తుంద‌ని ఈ సంద‌ర్భంగా నూత‌న‌ బోర్డు తెలిపింది. తెలుగు సమాజ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మాటా సంఘం నూత‌న నాయకత్వ బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. తన పదవీకాలంలో MATA అనూహ్యమైన అభివృద్ధి సాధించి, అనేక సమాజాలకు చేరుకుని అవిస్మరణీయమైన ప్రభావాన్ని చూపిందని ఆయన గుర్తుచేశారు. శ్రీనివాస్ గన‌గోని సలహా మండలి సభ్యులుగా(Advisory Council Member) బాధ్యతలు స్వీకరించి, MATA భవిష్యత్తును మరింత ముందుకు నడిపేందుకు తన అనుభవాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించనున్నారు. ‘ది ల్యాండ్’ మ్యాగజైన్ (The Land Magazine) వారి 2024-25 “Person of the Year” టైటిల్‌కు ఎంపికై, సత్య నాదెళ్ల, పవన్ కళ్యాణ్ వంటి మహోన్నత వ్యక్తులతో పాటు పురస్కారాన్ని అందుకోవడం, సమాజంపై ఆయన చేసిన గొప్ప ప్రభావానికి ఘనత చాటి చెబుతోంది.

USA

అనంత‌రం వ్యవస్థాపకులు, సలహా మండలి సభ్యులు ప్రదీప్ సమల, జితేందర్ రెడ్డి తదితరులు ప్ర‌సంగించారు. వారు మాటా పాటించే ముఖ్యమైన విలువలను గురించి తెలుపుతూ, సమాజ సేవ, నాయకత్వంలోని సవాళ్లు, అవకాశాలను వివరించారు. జితేందర్ రెడ్డి ‘మాటా’ భవిష్యత్ మార్గాన్ని స్పష్టం చేస్తూ, కొత్త నాయకత్వ బృందాన్ని మరింత ముందుకు సాగమని ప్రోత్సహించారు.

సేవ, సంస్కృతి, సమానత్వంపై దృష్టి

అధ్య‌క్ష బాధ్యతలు స్వీకరించిన రమణ కృష్ణ కిరణ్ దుద్దాగి భవిష్యత్ కార్యాచరణ విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఈ పదవీకాలంలో కీలకమైన ఐదు లక్ష్యాలపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.

Also Read: Airtel: ఎయిర్‌టెల్.. ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే !

  1. సేవ: అమెరికాలోని అన్ని తెలుగు కుటుంబాలకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలను విస్తరించడం.
  2. సంస్కృతి: తెలుగు వారసత్వాన్ని కాపాడుతూ, సంస్కృతిని ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం.
  3. సమనత్వం: కొత్త ఛాప్టర్లను ప్రారంభించి, సభ్యులకు సమాన అవకాశాలను కల్పించడం.
  4. యువశక్తి: యువ నాయకత్వానికి సరైన వేదికలను అందించడం.
  5. మహిళా నాయకత్వం: మాటాలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం.

ఈ కార్యక్రమంలో ‘మాటా’ 2026 మహాసభ (MATA Convention) నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు ప్రకటించారు. ఇది తెలుగు సంస్కృతి, వ్యాపారం, యువజన నాయకత్వం, మహిళా సాధికారత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రాముఖ్యత కలిగిన సమ్మేళనం కానుంది. అలాగే, ఇదే వేదిక‌పై ‘మాటా ముచ్చట’ అనే త్రైమాసిక వార్తా పత్రిక ప్రారంభించారు. ఇది సంస్థ విజయాలను, భవిష్యత్తు కార్యక్రమాలను సభ్యులకు తెలియజేస్తుంది.

ఎగ్జిక్యూటివ్ కమిటీ: ప్రెసిడెంట్: రమణ కృష్ణ కిరణ్ దుద్దగి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: ప్రవీణ్ గూడూరు, సెక్రటరీ: విజయ్ భాస్కర్ కలాల్, ట్రెజరర్: శ్రీధర్ గూడాల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: నగేష్ చిలకపాటి, నేషనల్ కోఆర్డినేటర్: టోనీ జన్ను, జాయింట్ సెక్రటరీ: రాజ్ ఆనందేషి,ప్రోగ్రామ్స్ & ఈవెంట్స్ డైరెక్టర్: స్వాతి అట్లూరి ,కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్: కల్యాణి రెడ్డి  బెల్లంకొండ , ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్: మహేందర్ నరాల, అడిషనల్ సెక్రటరీ: శ్రీధర్ పెంట్యాల, స్పిరిచువల్ & మెంబర్‌షిప్ డైరెక్టర్: శిరీషా గుండపనేని, హెల్త్ & వెల్నెస్ డైరెక్టర్: డా. సరస్వతి లక్కసాని, పబ్లిసిటీ  పీఆర్ మీడియా: ప్రశాంత్ శ్రీపేరంబుదురు, స్పోర్ట్స్ డైరెక్టర్: సురేష్ ఖజాన, ఇండియా కోఆర్డినేటర్: డాక్టర్ విజయభాస్కర్  బొలగాం.

USA

బోర్డు అఫ్ డైరెక్టర్స్: మల్లిక్ బొల్లా, శ్రీనివాస్ తాటిపాముల, శ్రీనివాస్ గండె, ప్రసాద్ వావిలాల, విజయ్ గడ్డం, రామ్ మోహన్ చిన్నాల, బిందు గొంగటి, హరికృష్ణ నరుకుళ్లపాటి, జ్యోతి బాబు అవుల (జేబీ), బాబా సొంటియాన, రంగ సూరా రెడ్డి, మహేంద్ర గజేంద్ర.

హానోరారి అడ్విసోర్స్: డాక్టర్ స్టాన్లీ రెడ్డి, దాము గేదెల, ప్రసాద్ కునిశెట్టి, పవన్ దర్శి, జైదీప్ రెడ్డి, శేఖర్ వెంపరాల, డాక్టర్ హరి ఎప్పనపల్లి, ప్రేమ రొద్దం, బాబురావు సామల, వెంకటేష్ ముత్యాల, నందు బలిజ, డాక్టర్ సునీల్ పారిఖ్, అనిల్ గ్రాంధి, బాలాజీ జిల్లా, రఘు వీరమల్లు, గంగాధర్ వుప్పల. త‌దిత‌రులు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 

ఈ వేడుకలో 250 మందికి పైగా సభ్యులు పాల్గొని కొత్త నాయకత్వ బృందానికి మద్దతు తెలిపారు. ‘మాటా’ వ్యవస్థాపకులు, సలహా మండలి, గౌరవ సలహాదారులు, కార్యవర్గం, బోర్డు సభ్యులు, ప్రాంతీయ ప్రతినిధులు, మరియు ఇతర నాయకులు హాజరై, ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.

ఈ సంద‌ర్భంగా ‘మాటా’ కొత్త బోర్డు స‌భ్యులు.. “మనం కలిసే ఎదుగుదాం, మనం కలిసి మార్పు తీసుకువ‌ద్దాం..! జయహో మాటా..!” అంటూ నిన‌దించారు.  ‘మాటా’ సేవ, సంస్కృతి, సమానత్వం అనే ప్రధాన విలువలను పాటిస్తూ, అమెరికాలోని తెలుగు సమాజానికి మరింత మద్దతుగా నిలిచేందుకు కృషి చేస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *