బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.బీఆర్‌ఎస్ రెండు నాల్కల ధోరణి వ్యవహరిస్తోందని అన్నారు.బీఆర్‌ఎస్ హయాంలోనే నేవల్ రాడార్ సెంటర్‌కు అనుమతులు వచ్చాయని చెప్పారు.
డిసెంబర్ 12, 2017లోనే అనుమతులు వచ్చాయని అన్నారు. జీవో 44ను అప్పటి ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. దీని విషయంలో అప్పుడు ల్యాండ్ అలాట్‌మెంట్‌లో ఆలస్యం జరిగిందని అన్నారు.
ప్రభుత్వంలో ఉంటే ఒకలా..ప్రతిపక్షంలో ఉంటే మరోలా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశభద్రతకు సంబంధించిన అంశంలో.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. దేశ రక్షణ కార్యక్రమాలను ఎవరూ వ్యతిరేకించడానికి వీలులేదని
దేశభద్రతకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరాటం చేస్తోందా? అని ప్రశ్నించారు. దామగుండంలో రాడార్ సెంటర్ వల్ల రాష్ట్రానికే గొప్ప పేరు వస్తుందని అన్నారు ఇది దేశభద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్పారు.

