Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో 33 రోజుల్లో 50 కోట్లకు పైగా భక్తులు స్నానాలు చేశారు. ఇది చరిత్రలో నమోదైన అతిపెద్ద సంఘటన అని చెప్పవచ్చు. 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాలో ఇంకా 12 రోజులు మిగిలి ఉన్నాయి. ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న వారి సంఖ్య అమెరికా లాంటి దేశాల మొత్తం జనాభా తో పోలిస్తే మూడో స్థానంలో దక్కుతుంది.
ప్రపంచంలో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు ఒక్క చోటికి చేరిన సంబరం చరిత్రలోనే ఇదే మొదటిది కావడం గమనార్హం. ఇప్పటివరకూ బ్రెజిల్‌లోని రియో ఫెస్టివల్‌కు లేదా జర్మనీలోని ఆక్టోబర్‌ఫెస్ట్‌కు వచ్చే జనసమూహం ఈ జనసమూహంతో పోలిస్తే నథింగ్ అని చెప్పవచ్చు. రియో కార్నివాల్ ఫిబ్రవరి 9న ప్రారంభమై ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుంది. ప్రతిరోజూ దాదాపు 20 లక్షల మంది దీనికి హాజరవుతారు. జర్మనీలో 16 రోజుల పాటు జరిగే అక్టోబర్ ఫెస్ట్‌కు దాదాపు 70 లక్షల మంది హాజరవుతారు. అంటే, ప్రపంచంలోనే అత్యధిక ప్రజలు పాల్గొనే ఉత్సవాల కంటే కూడా దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ మంది మహా కుంభమేళాకు ఇప్పటి వరకూ హాజరు అయ్యారు.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: కొత్త సమస్యలలో ఇరుకున్న కేజ్రీవాల్
ఈరోజు శనివారం, ఆ తర్వాత ఆదివారం. అటువంటి పరిస్థితిలో, వారాంతంలో రద్దీ ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా లక్నోలో ఒక సమావేశం నిర్వహించారు. సీనియర్ అధికారులు స్వయంగా వీధుల్లోకి వచ్చి ప్రతి స్థాయిలో జవాబుదారీతనం ఉండేలా చూసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభానికి దారితీసే రోడ్లపై ఎక్కడా ట్రాఫిక్ జామ్ ఉండకూడదని యోగి చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఏదైనా జామ్ ఏర్పడితే అక్కడి అధికారులే జవాబుదారీగా ఉంటారని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా గురువారం అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్ ట్రస్టీ పరమానంద్ మహారాజ్ ఆరోగ్యం క్షీణించింది. ఛాతీ నొప్పి తర్వాత ఆయనను సెంట్రల్ హాస్పిటల్ మహాకుంబ్ కు తీసుకువచ్చారు. ఇక్కడ ఆయన్ని ఐసియులో ఉంచారు. ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో ఆయనను విమానంలో AIIMS ఢిల్లీకి తరలించారు.