Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి 7641 అనే రిమాండ్ ఖైదీ నెంబర్ కేటాయించబడింది. కిడ్నాప్ ,బెదిరింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీని నిన్న ఉదయం అరెస్టు చేసిన తర్వాత, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారణ జరిగింది. తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరు పరచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
