Brahma Anandam: హాస్య బ్రహ్మ బ్రహ్మ నందం, ఆయన కొడుకు రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్రహ్మ ఆనందం. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కంప్లీట్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో ఈ సినిమా నిరాశపరిచిందనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ బాగానే ఉన్నా కానీ సెకండ్ హాఫ్ లో కామెడీ, ఎమోషన్స్ పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. చూసేవారికి ఎందుకో సాగ తీసిన ఫీలింగ్ కలుగుతుంది.. నిజానికి సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే కానీ దాన్ని సరిగ్గా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. బ్రహ్మ నందంని చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
