Cooking with Toilet Water: ఛీ  ఏం పని అది.. టాయిలెట్ నీళ్లతో కాబోయే డాక్టర్లకు వంట.. ఆ వైద్య విద్యార్థులు ఏం చేశారంటే.. 

Cooking with Toilet Water: “వైద్యో నారాయణో హరిః” అనే శ్లోకం మనకు వైద్యుల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కానీ ఇక్కడ రోగుల ప్రాణాలు కాపాడే భవిష్యత్తు వైద్యుల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో ఉన్న మెడికల్ కాలేజీ విద్యార్థులకు టాయిలెట్ నీటితో ఆహారం తయారు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Cooking with Toilet Water: మెడికల్ కాలేజీలో సీటు పొందడానికి విద్యార్థులు చాలా కష్టపడాలి అని అంటారు. ఎందుకంటే వైద్య విద్యార్థి కావడానికి అనేక అడ్డంకులు ఎదుర్కోవడమే కాకుండా లక్షల రూపాయల ఫీజు కూడా చెల్లించాలి. కొన్ని కళాశాలలు ఈ విషయంలో కోట్లాది రూపాయలు వసూలు చేస్తాయి. ఇలాంటి చెడిపోయిన విద్యా వ్యవస్థ మధ్య విద్యార్థులకు అందించే ఆహారంలో కూడా కల్తీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సంఘటన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

టాయిలెట్ నీటిలో వంట!

Cooking with Toilet Water: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీలో జాతీయ స్థాయి వైద్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు కారణంగా కళాశాల అధికారులు విద్యార్థులకు ప్రత్యేక ఆహారం తయారు చేయాలని ఆదేశించారు. అయితే ఇలా ఆహారం తయారు చేసే సమయంలో టాయిలెట్ కమోడ్ ద్వారా నీటిని తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను తీసిన విద్యార్థులు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వైద్య కళాశాల విద్యార్థుల ఆగ్రహం

Cooking with Toilet Water: టాయిలెట్ నీటిని ఉపయోగించి వైద్య కళాశాల విద్యార్థులకు ఆహారం తయారు చేసిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అయింది. విద్యార్థులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించిన అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ ప్రధాన వైద్య అధికారి డాక్టర్ సంజయ్ మిశ్రా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్

మొత్తానికి తింటున్న అన్నంతో ఈ విధంగా ఆటలాడిన వారికి తగిన గుణపాఠం చెప్పాలనేది నెటిజన్ల డిమాండ్. ముఖ్యంగా లక్షల ఫీజులు కట్టి వచ్చినప్పటికీ వైద్య విద్యార్థులకు ఇలాంటి చెత్త ఆహారం అందిస్తున్నందుకు ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలని ప్రజలు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *