Telangana: అది ప్రాథమికోన్నత పాఠశాల. పంతుళ్లు పాఠాలు బోధించేశారు. పిల్లలను ఇండ్లకు పంపించేశారు. ఎప్పుడు వెళ్లాలా అన్న ఆతృతతో తరగతి గదులకు తాళాలేసేశారు. సాయంత్రం 3.30 గంటలకు ఎంచక్కా వారు కూడా ఇండ్లదారి పట్టారు. ఈ లోగా 3.30 తర్వాత ఇంటికి రావాల్సిన ఒకటో తరగతి చదివే తమ బాలుడు ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆచూకీ వెతుక్కుంటూ ఏకంగా బడికే వెళ్లడంతో టీచర్ల నిర్వాకం బయటపడింది.
Telangana: నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని శాయన్‌పేట ప్రాథమికోన్నత పాఠవాల సమయం దాటిపోగానే విద్యార్థులందరూ ఇండ్లకు వెళ్లిపోగా ఉపాధ్యాయులు తరగతి గదులకు తాళాలు వేసి వెళ్లిపోయారు. అయితే ఒకటో తరగతి చదివే విద్యార్థి శరత్ నిద్రపోవడంతో గదిలో ఉండిపోయాడు.
Telangana: సాయంత్రం 3.30 గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా, 4 గంటలు దాటినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి మల్లేశ్ పాఠశాలకు వెళ్లి వెతికాడు. ఈ క్రమంలో తరగతి గది కిటికీ తెరిచి చూడగా శరత్ ఇంకా నిద్రపోతూనే కనిపించాడు. దీంతో తాళం పగులగొట్టి కుమారుడిని బయటకు తీసుకొచ్చాడు. ఇదన్నమాట విషయం. కనీసం విద్యార్థులు అందరూ వెళ్లారా? లేదా? అని చూసుకోకపోవడంపై ఉపాధ్యాయుల నిర్వాకంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

