Thandel: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ వసూళ్ల సునామి సృష్టిస్తుంది. నాలుగు రోజులుగా స్టడీగా గ్రోత్ కొనసాగిస్తూ భారీ కలెక్షన్లను సాధిస్తోంది. మొదటి రోజు 21.27 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, రెండో రోజు 41.20 కోట్ల మార్క్‌ను అందుకుంది. ఇక మూడు రోజులకు గాను 62.37 కోట్లు క్రాస్ చేయడం విశేషం. అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో నాలుగో రోజు 73.20 కోట్లు వరల్డ్‌వైడ్‌గా సాధించింది.
Also Read: Vellore: పురాతన నిధుల కోసం వేట.. దుండగులు చేసిన పనికి నష్టం అంతా ఇంతా కాదు!
తాజాగా ఐదో రోజు తండేల్ వసూళ్లు 80.12 కోట్లకు చేరడం విశేషం. ఇదే స్పీడ్‌తో తండేల్ వెళ్లితే త్వరలోనే వంద కోట్ల క్లబ్ చేరడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన తండేల్ సినిమా, త్వరలో మరో కొత్త రికార్డ్ ను అందుకోవడం ఖాయం.

