PM Narendra Modi:భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనపై బాంబు బెదిరింపు కలకలం రేపుతున్నది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారమే ఆయన విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తొలుత ఆయన ప్రాన్స్ చేరుకున్నారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో ప్రస్తుతం బిజీగా పాల్గొంటున్నారు. అయితే ఆయన బయలుదేరే రోజుకు ముందు రోజే ఈ బెదిరింపు కాల్ రావడం గమనార్హం.
PM Narendra Modi:ఫిబ్రవరి 11న ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ విమానంపై ఉగ్రవాదులు దాడి చేయవచ్చు అని కాల్ చేసిన వ్యక్తి బెదిరించారు. మోదీ విమానాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి జరగొచ్చని తమకు ఫోన్ కాల్ సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే అక్కడి పోలీస్ అధికారులు దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశారు. కాల్‌చేసిన వ్యక్తి కోసం ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
PM Narendra Modi:అయితే ఫోన్‌కాల్‌తో బెదిరించిన వ్యక్తిని ఎట్టకేలకు ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని ప్రాథమిక నిర్ధారించారు. అయితే లోతైన దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. దేశ అధినేత వెళ్లే విమానంపై బెదిరింపుల కారణంగా మరింత భద్రతను కట్టుదిట్టం చేసే పనిలో రక్షణ సిబ్బంది ఉన్నట్టు తెలిసింది.
PM Narendra Modi:ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ప్రాన్స్‌లో జరుగుతున్న కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. పారిస్ పర్యటనను ముగించుకొని ఈ రోజు (ఫిబ్రవరి 13న) అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడే రెండు రోజులపాటు పర్యటిస్తారు. ఈ సందర్భంగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుతో మోదీ భేటీ కానున్నారు.