Dragon Trailer: తమిళ డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించి, డైరెక్ట్ చేసిన ‘లవ్ టుడే’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. తెలుగులో రిలీజ్ చేయగా, ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం యూత్‌ఫుల్ కంటెంట్‌తో నింపేశారు మేకర్స్. ఈ ట్రైలర్ నెటిజన్స్ ని ఫిదా చేస్తుంది. మరి ఈ కుర్ర డైరెక్టర్ కం యాక్టర్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

