Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ 300 కోట్ల పైగా వసూళ్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను మొదట ఓటీటీలో కాకుండా శాటిలైట్‌లో టెలికాస్ట్ చేసేందుకు జీ ప్లాన్ చేస్తుంది. జీ తెలుగు ఛానల్‌లో ఈ చిత్రాన్ని ముందుగా టెలికాస్ట్ చేస్తే, థియేటర్స్‌లో వచ్చిన రెస్పాన్స్ బుల్లితెరపై కూడా మరోసారి చూడొచ్చని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 5 వారాలకు డిజిటల్ టెలికాస్ట్ చేయనున్నారని.. ఈ లెక్కన ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా జీ తెలుగు ఛానల్‌లో టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఓటీటీలో కాకుండా ముందుగా టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ కి రెడీ అవుతూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది.

