Maha kumbhamela

Mahaa Kumbha Mela: ట్రాఫిక్ లో 15 గంటలుగా అరెస్ట్ అయిపోయిన భక్త జనం.. మహా కుంభమేళా దారులన్నీ జామ్!

Mahaa Kumbha Mela: ఆదివారం సెలవు దినం కావడంతో మహా కుంభమేళాలో భక్తుల రద్దీ ఎక్కువైపోయింది. సంగంకు దారితీసే అన్ని రోడ్లపై 10 నుండి 15 కి.మీ.ల పొడవునా జామ్ అయిపొయింది.  వారణాసి, లక్నో, కాన్పూర్, రేవా నుండి ప్రయాగ్‌రాజ్ వరకు 25 కి.మీ.ల దూరం వరకూ వాహనాలు నిలబడిపోయాయి.  సంగమంలో స్నానం చేయబోయే వారు, అక్కడి నుండి తిరిగి వచ్చే భక్తులు జామ్ తొలగిపోయే వరకు ఆకలితో, దాహంతో వేచి ఉదనాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Mahaa Kumbha Mela: ప్రయాగ్‌రాజ్ జంక్షన్ వద్ద జనసమూహాన్ని నిర్వహించడానికి అత్యవసర జనసమూహ నిర్వహణ ప్రణాళికను అమలు చేశారు. ప్రయాగ్‌రాజ్ సంగం స్టేషన్ ఫిబ్రవరి 14 వరకు మూసివేస్తున్నట్టు  లక్నోలోని నార్తర్న్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కుల్దీప్ తివారీ తెలిపారు. లక్నోకు తిరిగి వస్తున్న భక్తుడు ఆకాశ్ ద్వివేది మాట్లాడుతూ, తన కారు మలకా గ్రామంలో 3 గంటలుగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయిందని అన్నారు.

Mahaa Kumbha Mela: ఇక్కడ 5 లక్షల మంది దారుణ  పరిస్థితిలో ఉన్నారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్‌లో పాల్గొనడానికి వచ్చిన భక్తులు  రోడ్డుపై అరెస్టు అయిపోయారు. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. భక్త జనం  సొంత వాహనాల్లోనే చిక్కుకుపోయారు. వారు తెచ్చుకున్న ఆహారం ఏదైనా, అది అయిపోయింది.  చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. పెద్దలు ఆందోళన చెందుతున్నారు. స్త్రీలు వాష్‌రూమ్ కోసం చూస్తున్నారు. డ్రైవర్లు ఆందోళన లో పడిపోయారు. దాదాపుగా 24 గంటలుగా ఇదే పరిస్థితి అక్కడ కొనసాగుతోంది. 15 నిమిషాల్లో చేరాల్సిన ప్రాంతానికి 10 గంటలు పడుతోంది అంటే అక్కడ ట్రాఫిక్ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.  పోలీసులు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లలోనే హైవేలపై ప్రయాగ్ రాజ్ వైపు వెళ్ళవద్దు. అక్కడ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోతారు అంటూ మైకుల్లో ఎనౌన్స్ చేస్తున్నారంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఊహించవచ్చు. 

Mahaa Kumbha Mela: అదే సమయంలో, మహా కుంభమేళాకు వెళ్లే రైళ్లలో జనసమూహం విపరీతంగా ఉంటుంది. వారణాసిలో స్థలం దొరకకపోవడంతో , మహిళలు రైలు ఇంజిన్‌లోకి ప్రవేశించి గేటు మూసివేశారు. ఏదో విధంగా బ్రతిమిలాడి పోలీసులు ఆ స్త్రీలను బయటకు తీసుకెళ్లారు. హర్దోయ్‌లో కూడా, కోచ్ గేటు తెరవకపోవడంతో కోపంతో ఉన్న భక్తులు గొడవ సృష్టించారు. రైలులో భారీ విధ్వంసం జరిగింది.

మొత్తంగా చూసుకుంటే మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ కావడానికి నాలుగు రోజులు పడుతుందని పోలీసులు అంటున్నారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *