Thandel: అక్కినేని నాగచైతన్య తండేల్ తో మొత్తానికి సూపర్ హిట్ కొట్టేశాడు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తండేల్ తో చాలా కాలం తరువాత సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు నాగ చైతన్య. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 7న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.
విడుదలకు ముందే పాటలు, ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచిన ఈ సినిమా విడుదలయ్యాక భారీ రెస్పాన్స్ అందుకుంది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటుంది.
ఇది కూడా చదవండి: Congress Defeat: ఢిల్లీలో కాంగ్రెస్ హ్యాట్రిక్..
తాజాగా మూవీ యూనిట్ ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ని ప్రకటించింది. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 21.27 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. రెండో రోజు కూడా బుకింగ్స్ అదిరిపోయాయని తెలుస్తుంది.
బుజ్జి తల్లి పూర్తి వీడియో సాంగ్: