Operation Aranya: ఆంధ్రప్రదేశ్ లో అటవీ ప్రాంతంలో విచ్చల విడిగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా.. అటవీ భూమలను ఆక్రమించుకోవడం.. అటవీ సంపదను కొల్లగొట్టడం వంటి అన్ని అరాచకాలను అడ్డుకోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రారంభించారు. ఆపరేషన్ అరణ్య పేరుతో పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్ లో ట్వీట్ చేశారు. ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న 195 ఎర్రచందనం దుంగల్ని పట్టుకోవడంలో కృషి చేసిన అటవీ శాఖ, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ అధికారులనుఁ సిబ్బందిని అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా ఆపరేషన్ అరణ్య (#opertionaranya) అనే హ్యాష్ ట్యాగ్ ను ఆయన ప్రారంభించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాం
Operation Aranya: “195 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో మరియు అక్రమ స్మగ్లింగ్‌లో ఉన్న 8 మంది నేరస్థులను పట్టుకోవడంలో ఆదర్శప్రాయమైన కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మరియు ఎర్రచందనం నిరోధక టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు.
Operation Aranya: ఈ ఆపరేషన్ మన విలువైన సహజ వారసత్వాన్ని రక్షించడంలో మన అమలు బృందాల తిరుగులేని నిబద్ధతకు నిదర్శనం. రెడ్ సాండల్స్ ఒక అరుదైన- అమూల్యమైన జాతి. దాని పరిరక్షణ చాలా ముఖ్యమైనది. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో మీ అంకితభావం, అప్రమత్తత – వేగవంతమైన చర్య నిజంగా అభినందనీయం.
Operation Aranya: గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు @ncbn నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్యప్రాణులు – అటవీ నేరాలను అరికట్టేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు అండగా నిలుస్తోంది. ఈ విజయం భవిష్యత్ తరాలకు మన అడవులను సంరక్షించడానికి నిరంతర అప్రమత్తత – చురుకైన అమలుకు స్ఫూర్తినిస్తుంది.
Operation Aranya: మరోసారి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ & హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఎస్పీ, రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్, తిరుపతి, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, తిరుపతి – ఎస్పీ, తిరుపతికి ఈ గణనీయమైన విజయాన్ని అందించారు.”
ఈ ట్వీట్ చేస్తూ అరణ్యంలో అరాచకాలను సహించేది లేదని.. అధికారుల సమన్వయంతో నిరంతరం అటవీ సంపదను కాపాడటానికి కృషి చేస్తారనీ చెప్పారు పవన్ కళ్యాణ్. ఆపరేషన్ అరణ్య సమర్ధవంతంగా ముందుకు తీసుకెళుతూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
I extend my heartfelt congratulations to the officers and personnel of the Andhra Pradesh Forest Department and the Red Sanders Anti-Smuggling Task Force for their exemplary efforts in detecting and seizing 195 red sanders logs and apprehending 8 offenders involved in illegal… pic.twitter.com/1RV7r6bGwD
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 7, 2025

