Mahaa Bhakthi : మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవానికి ఏపీ ఐటీశాఖామాత్యులు నారా లోకేష్ కు గౌరవ ఆహ్వానం అందించిన మహా వంశీ

Mahaa Bhakthi: మహా న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో  వార్తా చానల్స్ లో తనదైన శైలితో ప్రజల ఆదరాభిమానాలతో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. అదేవిధంగా మహా మ్యాక్స్ పేరుతొ ఎంటర్టైన్మెంట్ రంగంలోనూ ప్రత్యేకంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది మహా న్యూస్ .  మహా గ్రూప్ నుంచి ఇటు వార్తా రంగంలోనూ అటు వినోద రంగంలోనూ ప్రత్యకమైన ప్రేక్షకులను సొంతం చేసుకున్న రెండు చానల్స్ తరువాత తెలుగు ప్రజలకు మరో ఛానల్ అందుబాటులోకి తీసుకువస్తోంది .  ఇటు ప్రజల సమస్యలను . . అటు రాజకీయ కథనాలను . . ప్రజలకు జరుగుతున్నా అన్యాయాలపై గళం విప్పుతూ తీసుకువస్తున్న కార్యక్రమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు .  అలాగే మహా మాక్స్ ఛానల్ ద్వారా తెలుగు సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు సినీ అభిమానులకు అందిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది .  ఇప్పుడు మహా గ్రూప్ నుంచి మరో ఛానల్ తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకువస్తోంది .

న్యూస్ ,  ఎంటర్టైన్మెంట్ రంగంలో దూసుకుపోతున్న మహా గ్రూప్ మరో కొత్త ఛానల్ తో ప్రేక్షకులకు దగ్గర కావడానికి సిద్ధం అవుతోంది .  ఇప్పటికే మహా న్యూస్ ఛానెల్, మహా మాక్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మహా గ్రూప్ నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజల కు సమాచార-వినోద కార్యక్రమాలను అందిస్తున్నాయి .  ఈ రెండు ఛానల్స్ ప్రేక్షకుల ఆదరాభిమానాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్నాయి. ఒక పక్క వార్తా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చేరవేస్తున్న మహా న్యూస్ మరోపక్క ప్రజల సమస్యలు.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ కథనాలను అందిస్తూ వస్తోంది. మహా న్యూస్ కథనాలతో రైస్ మాఫియా లాంటి దోపిడీపై పెద్ద యుద్ధమే సాగింది .  అలాగే , మరోపక్క మహా మాక్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ద్వారా సినిమా సంగతులను తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తూ వస్తోంది .  ఆనాటి సినిమా కథలు . . ఈనాటి మూవీ పోకడలు . . వెండి తెర వెనుక సంగతులు . . ఇలా వినోద ప్రపంచంలో ఎన్నో విశేషాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ . . ఆదరాభిమానాలను చూరగొంటోంది.

Mahaa Bhakthi: ఈ నేపథ్యంలో మహా గ్రూప్ నుంచి ప్రత్యేకంగా భక్తి ఛానల్ రాబోతోంది. పండుగలు . . పర్వదినాలు . . మన సంస్కృతీ సంప్రదాయాలు . . సనాతన ధర్మ పరిరక్షణ . . అన్నిటినీ కలబోసి తెలుగు ప్రజల కోసం నిరంతర భక్తి స్రవంతిని అందించడానికి మహా గ్రూప్ నడుం బిగించింది. మహా గ్రూప్ భక్తి పూర్వకంగా తెలుగు ప్రేక్షకులకు సమర్పించబోతున్న మహా భక్తి ఛానల్ దేవదేవుని ఆశీస్సులతో.. మహా శివరాత్రి పర్వదినం రోజున ప్రారంభించడానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 26న జరిగే మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖామాత్యులు  గౌరవనీయులు నారాలోకేష్ గారిని  గారిని ఆహ్వానించారు మహా గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ళ వంశీకృష్ణ. ఈ సందర్భంగా మహా గ్రూప్ నుంచి వస్తున్న మహా భక్తి ఛానల్ గురించిన వివరాలను నారా లోకేష్ గారికి  వివరించారు మారెళ్ల వంశీకృష్ణ.

Mahaa Bhakthi lokesh

Mahaa Bhakthi: మహా గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ళ వంశీకృష్ణ ఆహ్వానానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు సానుకూలంగా స్పందించారు. మహా గ్రూప్ తీసుకువస్తున్న భక్తి ఛానల్ ప్రజల ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Mahaa Bhakthi lokesh 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *