War-2: ‘దేవర’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘బ్రహ్మస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి తారక్ మంచి పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ కి హృతిక్ తో పలు ఎనర్జిటిక్ యాక్షన్, డాన్స్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయని తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: Pushpa 2: ఓటిటిలో కూడా రికార్డుల రపరప!
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి తారక్ పేరు లీక్ అయ్యింది. ఈ మూవీలో ఎన్టీఆర్ స్క్రీన్ నేమ్ వీరేంద్ర రఘునాథ్ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలా పవర్ఫుల్ గా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.