Horror OTT

Horror OTT: 5 కోట్లతో తీస్తే 50 కోట్లు.. ఓటీటీలోకి వచ్చేసిన జీవా హారర్ థ్రిల్లర్!

Horror OTT: తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైన తమిళ హీరోల్లో జీవా ఒకరు. రంగం సినిమాతో బాగా కనెక్ట్ అయ్యాడు. ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర 2లో వైఎస్ జగన్ పాత్రలో అత్యద్భుతంగా నటించి మెప్పించాడు. ఇక గతేడాది తమిళంలో జీవా నటించిన సినిమా బ్లాక్. ఎలాంటి అంచనాలు లేకుండా విడదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

‘కోహెరెన్స్ ‘అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు బాల‌సుబ్ర‌మ‌ణి ఈ సినిమాను రూపొందించారు. సైన్స్‌ ఫిక్షన్‌ కాన్సెప్ట్‌కు సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ వంటి ఎలిమెంట్స్ యాడ్ చేసి ఈ సినిమాను తీశారు. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

ఇది కూడా చదవండి: S Jaishankar: పాశ్చాత్య దేశాల్లో ప్రజాస్వామ్యం పేరుతో జరిగే కపటత్వం ఇక పనిచేయదు

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా థియేటర్లలో ఆడియెన్స్ని మెప్పించింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. డార్క్ పేరుతో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకొని సడన్ గా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vivek vs Prem Sagar: చెప్పినట్లే చేసిండు..! మంత్రి వివేక్‌కు గట్టి షాకు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *