Dimple Hayathi: రాజోలు మండలం తాటిపాక లోని కాంచీపురం వారి K S R షాపింగ్ మాల్ లో ప్రముఖ సినీ నటి కుమారి డింపుల్ హయతి సందడి చేశారు. తాటిపాక చాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు దొరబాబు షాపు ప్రారంభోత్సవం చేయగా సినీనటి హయతి జ్యోతి ప్రజ్వలన చేసి.. మాల్ లో ఉన్న దాదాపు 99 రూపాయల నుండి 55 వేల రూపాయలు వరకు విలువ చేసే చీరలను ప్రత్యేకంగా పరిశీలిస్తు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.మాల్ ఎదురుగా ఉన్న స్టేజ్ పైకి ఎక్కి యువతను ఉర్రూతలూగిస్తు హయతి కాసేపు హంగామా చేశారు హీరోయిన్ ఇక్కడికి వస్తారనే ప్రచారం ముందే జరగడంతో దాదాపు ఉదయం 8 గం నుండి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు.
ఈ సందర్భంగా మాల్ యజమాని కేసర్ల సుబ్బరాజు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకే అందించేందుకు ఈ ప్రాంతంలో బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం చేయడం తమ సంస్థ లక్ష్యమన్నారు. తమ వ్యాపారాభివృద్ధికి సహకరించవలసినదిగా కస్టమర్ దేవుళ్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆప్ కామర్స్ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.