PM Modi:

PM Modi: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ప్ర‌ధాని మోదీ లేఖ

PM Modi: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లేఖ రాశారు. చానా రోజుల త‌ర్వాత ప్ర‌ధాని మోదీ.. కేసీఆర్ కు లేఖ రాయ‌డం విశేషం. కేసీఆర్ సోద‌రి ఇటీవ‌ల మ‌ర‌ణించిన వార్త తెలిసిన ప్ర‌ధాని ఈ మేర‌కు కేసీఆర్‌కు సానుభూతిని వ్య‌క్తంచేస్తూ ఈ లేఖ‌ను పంపారు.

PM Modi: కేసీఆర్ సోద‌రి స‌క‌ల‌మ్మ (82) ఇటీవ‌ల అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఆమె కేసీఆర్‌కు ఐదో సోద‌రి. ఆమె మ‌ర‌ణానికి తాను చింతిస్తున్న‌ట్టు పేర్కొంటూ ప్ర‌ధాని త‌న లేఖ‌లో పేర్కొన్నారు. స‌క‌ల‌మ్మ మ‌ర‌ణంపై సంతాపం ప్ర‌క‌టించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతిని వ్య‌క్తం చేశారు. ఆ బాధ నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, ప్ర‌జాసేవ‌లో నిమ‌గ్నం కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు మోదీ పేర్కొన్నారు.

PM Modi: కేసీఆర్ సోద‌రి స‌క‌ల‌మ్మ‌ది సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ‌లం పెదిర్ గ్రామం. ఆమె భ‌ర్త హ‌నుమంత‌రావు కొన్నేళ్ల క్రిత‌మే క‌న్నుమూశారు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆమె గ‌త కొంత‌కాలంగా వృద్ధాప్య స‌మ‌స్య‌లు, అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్‌లోని ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతూ గ‌త నెల 25న తుదిశ్వాస విడిచారు.

ఇదిలా ఉండ‌గా, కేసీఆర్ సోద‌రి చీటీ స‌క‌ల‌మ్మ ద్వాద‌శ దిన‌క‌ర్మ మంగ‌ళ‌వారమే జ‌రిగింది. హైద‌రాబాద్ స‌మీపంలోని కొంప‌ల్లిలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ హాజ‌రయ్యారు. ఆమె చిత్ర‌ప‌టానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఆయ‌న‌తోపాటు కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌, ప‌లువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయ‌కులు హాజ‌రై స‌క‌ల‌మ్మ‌కు నివాళుల‌ర్పించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *