INR vs USD

INR vs USD: అమ్మో.. రూపాయి విలువ మరింత పడిపోయింది!

INR vs USD: రూపాయి విలువ మరింత దిగజారింది. రూపాయి ఈ రోజు అంటే ఫిబ్రవరి 3న ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. యుఎస్ డాలర్‌తో పోలిస్తే 67 పైసలు పతనమై, డాలర్‌కు రూ.87.29 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది.
కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్ సుంకాలు విధించడమే రూపాయి పతనానికి కారణమని ఫారెక్స్ వ్యాపారులు అంటున్నారు. దీనిని ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తొలి అడుగుగా పేర్కొంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి.

ఫిబ్రవరి 1న, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికోలపై 25% అలాగే, చైనాపై అదనంగా 10% టారిఫ్‌లను ప్రకటించారు. అయితే, ఈ లిస్టులో భారత్ పేరును ట్రంప్ తీసుకోలేదు. అంతకుముందు, ఫ్లోరిడాలో జరిగిన ఒక కార్యక్రమంలో, అతను భారతదేశం, చైనా , బ్రెజిల్ వంటి దేశాలపై అధిక సుంకాలు విధిస్తానని బెదిరించారు.

ఇది కూడా చదవండి: Stock Market: స్టాక్ మార్కెట్ కు విలన్ గా మారిన అమెరికా 5 నిమిషాల్లో రూ.5 లక్షల కోట్లు నష్టం.

బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు విధిస్తానని ట్రంప్ చాలాసార్లు బెదిరించారు. భారతదేశం, బ్రెజిల్, చైనా మూడు బ్రిక్స్‌లో భాగం. ఇది కాకుండా, అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధించడంపై ట్రంప్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌పై కూడా సుంకాల ముప్పు పొంచి ఉంది.

దిగుమతులు ఖరీదైనవిగా మారుతాయి..
రూపాయి పతనం అంటే వస్తువుల దిగుమతులు భారతదేశానికి ఖరీదైనవిగా మారుతున్నాయి. అంతే కాకుండా విదేశాలకు వెళ్లడం, చదువుకోవడం కూడా ఖరీదైంది. డాలర్‌తో రూపాయి విలువ 50 ఉన్నప్పుడు, అమెరికాలోని భారతీయ విద్యార్థులు 50 రూపాయలకు 1 డాలర్‌ను పొందవచ్చనుకుందాం. ఇప్పుడు 1 డాలర్ కోసం విద్యార్థులు 86.31 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఫీజుల నుంచి వసతి, ఆహారం, ఇతరత్రా అన్నీ ఖరీదైనవిగా మారనున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *