AP News: ఆంధ్రప్రదేశ్‌లో అనేక మున్సిపల్ చైర్మన్ మేయర్ ఎన్నికలు ఉత్సాహంగా సాగాయి. హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీకి చెందిన రమేశ్ ఎన్నికయ్యారు. ఏలూరు నెల్లూరు డిప్యూటీ మేయర్ స్థానాలను కూడా టీడీపీ సొంతం చేసుకుంది. అలాగే, బుచ్చిరెడ్డిపాలెం డిప్యూటీ చైర్మన్ పదవిని కూడా టీడీపీ గెలుచుకుంది.
హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా కౌన్సిలర్ రమేశ్ ఎన్నికయ్యారు. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతు తెలిపారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి 14 ఓట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Mahaa Bhakthi Channel: భావితరాలకు సనాతన ధర్మ విశేషాలను అందించేందుకే మహాభక్తి ఛానల్: మహా గ్రూప్ ఛైర్మన్ ఎండీ వంశీకృష్ణ
ఏలూరులో రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఉమామహేశ్వరరావు దుర్గాభవానీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారని అధికారులు ప్రకటించారు. నెల్లూరులో డిప్యూటీ మేయర్‌గా టీడీపీ మద్దతు అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా టీడీపీ మద్దతు అభ్యర్థులు ఎరటపల్లి శికుమార్ రెడ్డి పటాన్ నస్రిన్ ఎన్నికయ్యారు.
తిరుపతి డిప్యూటీ మేయర్, నందిగామ మున్సిపల్ చైర్మన్ పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కోరం సరిపోకపోవడంతో ఈ ఎన్నికలను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.