TG: మిషన్ భగీరథ నీరు రాక స్థానికంగా ఉన్న ఓ బావి నీటిని తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్‌రావు పేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. వీరిలో ఇద్దరు మృతి చెందగా, మిగతా వారంతా చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఆ కలుషిత నీటిని తాగిన కారణంగా సుమారు 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషమంగా ఉన్నవారిలో ఒకరిని సంగారెడ్డి, మరో ఇద్దరిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నదని సమాచారం.

