Viral news: బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలోని సావో థోమ్ దాస్ లెట్రాస్ పట్టణంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఆకాశం నుంచి వర్షం చుక్కల వేలాది సాలెపురుగులు క్రిందికి వచ్చాయి, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా వర్షం, వడగండ్ల వర్షం మనం చూసి ఉంటాం, కానీ సాలెపురుగుల వర్షం జరగడం చాలా అరుదు. నిపుణుల ప్రకారం, ఇది సహజ పరిణామమే. కైరాన్ పాసోస్ వివరించినట్లు, కొన్ని సామూహిక జీవన విధానాన్ని పాటించే సాలెపురుగుల జాతులు పెద్ద పెద్ద జాలాలను తయారు చేస్తాయి.
ఇవి ఎక్కువగా చెట్ల మధ్య లేదా గాలిలో వేలాడే విధంగా ఏర్పడతాయి. వాతావరణ మార్పులు, గాలి వేగం వంటి కారణాల వల్ల ఇవి ఒకేసారి పెద్ద సంఖ్యలో కదలిపోతాయి. మరోవైపు, ఈ సంఘటనకు సాలెపురుగుల సంభోగ ప్రవర్తన కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆడ సాలెపురుగులు వివిధ మగ సాలెపురుగుల నుండి స్పెర్మ్‌ను సేకరించి భద్రపరచుకుంటాయి. వీటి శరీరంలో స్పెర్మాథెకా అనే ప్రత్యేకమైన అవయవం ఉండటం వల్ల భవిష్యత్తులో అండాలను ఫలదీకరించడానికి వీలవుతుంది. ఇది జన్యు వైవిధ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కొన్ని Stegodyphus, Anelosimus వంటి సాలెపురుగుల జాతులు సామూహికంగా నివసిస్తూ పెద్ద పెద్ద జాలాలు తయారు చేసుకుంటాయి.
ఇవి వేటాడటం, ఆహారాన్ని పంచుకోవడం, రక్షణ కల్పించుకోవడం వంటి వాటిలో పరస్పరం సహాయపడతాయి. అయితే, సంభోగం అనంతరం ఈ సమూహం విడిపోవడం సహజమే. స్పైడర్ వర్షం ఇదే తొలిసారి జరగడం కాదు. 2019లో కూడా బ్రెజిల్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సమయంలో స్థానిక ప్రజలు ఆకాశం నుంచి వేలాది సాలెపురుగులు వస్తున్నట్లు చూసి భయపడ్డారు. కానీ నిపుణులు దీనిని సహజ దృగ్విషయంగా పేర్కొన్నారు. బ్రెజిల్‌లో చోటుచేసుకున్న ఈ స్పైడర్ వర్షం మరోసారి ప్రకృతి అద్భుతాలను రుజువు చేసింది.
స్పైడర్లు సమూహంగా ఏర్పడి, గాలిలో తేలిపోతూ వేలాడుతూ ఉండటం వలన ఇది వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది భయంకరంగా అనిపించినా, అసలు విషయం తెలిసిన తర్వాత ఇది సహజమైనదే అని అర్థమవుతుంది. ప్రకృతిలో ఎన్నో వింతలు ఉన్నాయనడానికి ఈ స్పైడర్ రెయిన్ ఒక అద్భుతమైన ఉదాహరణ!