Uttarakhand: వీళ్ళు మనుషులేనా… రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టిర్రు

ఉత్త‌రాఖండ్‌లో పెను ప్ర‌మాదం త‌ప్పింది.గుర్తు తెలియ‌ని దుండ‌గులు రూర్కీ స‌మీపంలో రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్‌ను ఉంచారు. ఉత్త‌రాఖండ్‌లోని ధందేరా రైల్వే స్టేష‌న్ మీదుగా ఓ గూడ్స్ రైలు వెళ్తుండ‌గా.. ఈ స్టేష‌న్‌కు స‌మీపంలో రైలు ప‌ట్టాల‌పై గ్యాస్ సిలిండ‌ర్‌ను అమ‌ర్చారు. లోకో పైల‌ట్ అప్ర‌మ‌త్త‌మై ఎమ‌ర్జెన్సీ బ్రేకులు వేసి, ప్ర‌మాదాన్ని త‌ప్పించాడు. క్ష‌ణాల్లోనే అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశాడు.

ఘ‌టనాస్థ‌లానికి చేరుకున్న రైల్వే అధికారులు.. సిలిండ‌ర్‌ను స్వాధీనం చేసుకుని ప‌రిశీలించారు. అది ఖాళీద‌ని నిర్ధారించారు. స్థానిక పోలీసులు, జీఆర్పీ అధికారులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స్థానిక పోలీసులు, జీఆర్పీ అధికారులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. శ‌నివారం ఈ ఘటన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *