Budget 2025: రక్షణ బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,81,210 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం గత ఏడాది రూ.6,21,940 కోట్ల కంటే ఎక్కువ. మొత్తం మూలధన వ్యయం రూ.1,92,387 కోట్లుగా అంచనా వేయబడింది. రెవెన్యూ వ్యయాన్ని రూ.4,88,822 కోట్లుగా ఉంచారు. పెన్షన్ కోసం రూ.1,60,795 కోట్లు కేటాయించారు.
మూలధన వ్యయం కింద ఎయిర్ క్రాఫ్ట్ , ఏరో ఇంజన్లకు రూ.48,614 కోట్లు కేటాయించారు. నౌకాదళానికి రూ.24,390 కోట్లు కేటాయించారు. ఇతర పరికరాల కోసం రూ.63,099 కోట్లు కేటాయించారు. 2024-25లో రక్షణ బడ్జెట్ కోసం ప్రభుత్వం రూ.6,21,940 కోట్లు కేటాయించింది. ఇందులో మూలధన వ్యయం రూ.1,72,000 కోట్లుగా అంచనా వేయబడింది.