Police attack on citizen: కొందరు పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చి మార్పులు తీసుకురావాలని ఉన్నతాధికారులు ఎంతగా ప్రయత్నించినా సఫలం కావడం లేదనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. పోలీసులు అంటే ఎవరినైనా, ఎక్కడైనా, ఎలాగైనా కొట్టొచ్చనే భావనతో ఓ యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. ఆ ఘటన అక్కడి సీసీ టీవీలో రికార్డు కావడంతో వారి దౌర్జన్యం కళ్లకు కట్టినట్టుగా బయటపడింది.
Police attack on citizen: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా ఉన్నది. ఈ టోల్‌ప్లాజాలో పనిచేసే రాజు అనే యువకుడిని నిన్న నలుగురు పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో దారుణంగా కొట్టినట్టు సీసీ టీవీ పుటేజీలో లభ్యమైంది. తనను దారుణంగా కొట్టిన పోలీసులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ యువకుడు రాజు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఈ రోజు ఫిర్యాదు చేశాడు. తప్పు చేసిన వారిని కూడా ఇలా దౌర్జన్యంగా కొట్టడాన్ని కూడా సమాజం సహించదు.
Police attack on citizen: తనను కానిస్టేబుళ్లు మల్లయ్య, శ్రీనివాస్, డ్రైవర్ మధుసూదన్, మరో కానిస్టేబుల్ కలిసి కొట్టారని, వ్యక్తిగత కక్షతోనే దద్దులు తేలేలా కొట్టారని ఆ యువకుడు ఆవేదన వ్యక్తంచేశాడు. పోలీసుల లాఠీ దెబ్బలతో ఆ యువకుడి చేతిమణికట్టు తీవ్రంగా దెబ్బతిన్నది. వీపుపై, కాళ్లపై లాఠీలతో విరుచుకుపడ్డారని ఆ యువకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.