Thandel: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను గురువారం పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఈ సినిమా రన్ టైమ్ రెండున్నర గంటలని వినికిడి. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎంగేజింగ్ ఉందని అంటున్నారు. కొందరు మత్స్య కారుల నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు చందు మొండేటి ఈ కథను రాసుకున్నారు. ఈ భావోద్వేగ ప్రేమకథా చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు నిర్మాత అల్లు అరవింద్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు చక్కటి ఆదరణ లభించింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన ప్రతిభను ఈ పాటలతో చాటుకున్నాడని శ్రోతలు చెబుతున్నారు. గురువారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ చెన్నయ్ లో జరిగింది. హీరో కార్తీ తమిళ వర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు. అలానే 31న ముంబైలో జరిగే ఈవెంట్ లో ఆమీర్ ఖాన్ పాల్గొనబోతున్నారు. చివరగా ఫిబ్రవరి 2న తెలుగు లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుబోతోంది. దానికి అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరవుతారని తెలుస్తోంది.
