SSMB 29: ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం జరుగుతోంది. కె.ఎల్. నారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఇటీవల రాజమౌళి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ తో ఈ సినిమా షూటింగ్ మొదలైందనే ప్రచారం జరిగింది. ఆ పోస్ట్ కు ప్రియాంక చోప్రా రెస్పాండ్ కావడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ లో ఉందనే విషయం ఖరారైంది. అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇంకా అది చర్చల దశలోనే ఉందని పృథ్వీరాజ్ తెలిపాడు. టెస్ట్ షూట్ పూర్తి అయిన తర్వాత వచ్చే నెలలో కెన్యాలో రెగ్యులర్ షూటింగ్ ను చిత్రబృందం మొదలు పెట్టబోతోంది. రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ను 2027లోనూ, సెకండ్ పార్ట్ ను 2029లోనూ విడుదల చేస్తారని సమాచారం. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో ప్రిన్స్ మహేశ్ జనం ముందుకు వచ్చాడు. సో… తిరిగి మూడేళ్ళ తర్వాతే అతను సిల్వర్ స్క్రీన్ మీద కనిపించేది.

